వర్తమాన కథా విమర్శలో కొత్త స్వరం బాలాజీ పోతుల. చిన్నవయసులోనే విమర్శకి కావలసిన నిర్భీతి, నిష్పక్షపాతం, సహనం పరికరాలుగా సమకూర్చుకున్న బాలాజీ శోభ పాఠకుల కోసం ‘కథాతీతం’ శీర్షిక నిర్వహించబోతున్నారు. ప్రతి నెలలో తన దృష్టికి వచ్చిన కథల నుంచి ఒకటి రెండు ఎంచుకుని మరుసటి నెలలో విశ్లేషణ చేస్తారు. సాహిత్యపరంగా ప్రశ్నని, చర్చని రేకెత్తించే అంశాలు ఉన్న కథలని తీసుకుంటారు. వాచక విమర్శ అవసరమైన కాలంలో ఈ శీర్షిక పాఠకుల ఆదరాభిమానాలు పొందుతుందని ఆశిస్తున్నాము.
– శోభ టీమ్




