ప్రజా వైద్యుడు ఆమెడ అమరత్వానికి నేటికి 30 ఏళ్లు

– కేవలం రూ.5లకే వైద్యం 
– 1996 సెప్టెంబర్ 25న నడి రోడ్డుపై అమానుష హత్య
– హంతకులు ఎవరనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న
– దుండగులను పట్టుకోలేని పాలకులు

– పేదల గుండెల్లో చిర‌స్మ‌ర‌ణీయుడు నారాయ‌ణ‌

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: పేద ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య వృత్తిని ఎంచుకుని సేవలందించే ప్రజా వైద్యుడిని 30 ఏళ్ల క్రితం పట్టపగలే నడిరో డ్డుపై దుర్మార్గులు కాల్చి చంపిన రోజిది. చిరునవ్వుతో పలకరిస్తూ రోగులకు సేవలు అందించే ప్రజా వైద్యుడిని అమానుషంగా కాల్చి చంపిన రోజును వరంగల్ జిల్లా ప్రజలు నేటికీ మరువలేకపో తున్నారు. వరంగల్ జిల్లా కేంద్రం పొలిమేరలోని మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఆమెడ నారా యణ ప్రజా వైద్యుడిగా అనతి కాలంలోనే ఖ్యాతిని గడించాడు. ఉదయం లేవగానే తన ద్విచక్ర వాహనంపై చుట్టుపక్కల సుమారు 30 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అంది స్తూ, పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేసిన ఆమెడ నారాయణ జిల్లా ప్రజలకు సుపరిచితులు.

రూ.5లకే వైద్యం

1990 ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో పౌర హక్కుల నేత స్వర్గీయ డాక్టర్ రామనాథం. చేతుల మీదుగా ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశాడు. ఆమెడ నారాయణ పేద ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే వైద్యం అందిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. వైద్యుడు అంటే దేవుడితో సమానం అనే భావన ఆ రోజుల్లో ప్రజల్లో ఉండేది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉద యం నుంచి మొదలుకొని సాయంత్రం వర కు రోగులకు వైద్యం అందించడమే కాకుం డా వారి కుటుంబ స్థితిగతులను కూడా తెలు సుకునే వ్యక్తిత్వం కలిగిన ఆమెడ నారాయణ అతి తొందరలోనే ప్రజా వైద్యుడిగా పేరు సంపాదించి పేద ప్రజల గుండెల్లో సుస్ధిర స్థానం ఏర్పరచు కున్నాడు.

1996 సెప్టెంబర్ ఉదయం 7.30గంటలు

అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఆయనకున్న పేరును కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోయాయి. ఎలాగైనా ఆమెడ నారాయణను అంతమొందించాలనే లక్ష్యంతో కొన్ని శక్తులు కుట్ర పన్నాయి. అందులో భాగంగానే 1996 సెప్టెంబర్ 25న ఉదయం 7.30 గంటల సమయంలో డాక్టర్ నారాయణను గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు.

కడసారి చూసేందుకు కదలి వచ్చిన పల్లెలు

ప్రజా వైద్యుడి హత్య వార్త జిల్లావ్యాప్తంగా  కలకలం రేపింది. సంఘటన స్థలానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. సుమారు 30 గ్రామాల నుంచి ముఖ్యంగా మొగిలిచర్ల గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి డాక్టర్ నారాయణకు కన్నీటి వీడ్కోలు పలికారు. దొంగచాటుగా కాల్చి చంపిన ఆ దుండగులపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అప్పటి పాలకుల కుట్రలో భాగంగానే నారాయణ హత్య జరిగినట్లు ప్రచారం జరిగింది. పోలీసుల చేతనే పాలకులు ఆమెడ నారాయణను చంపించారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత వహించాలని ప్రజాసంఘాలు దుమ్మెత్తి పోశాయి. డాక్టర్ నారాయణ
మరణించి నేటికి 30 ఏళ్లు కావస్తున్నప్పటికీ పాలకులు దుండగులను పట్టుకోకపోవడం శోచనీయం. ఇప్పటివరకు హంతకులను
గుర్తించకపోవడం ప్రజల్లో ప్రశ్నగానే మిగిలింది. నేటికీ డాక్టర్ నారాయణను ప్రజల స్మరించుకుంటున్నారంటే ప్రజల మనుషులు ఎప్పుడూ చిరస్మరణీయులే అనేది వాస్తవం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *