వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో చీలికలు

– నాలుగు వర్గాలుగా నాయకులు
– త్రిశంకు స్వర్గంలో జంపు జిలానీలు
– వర్గ పోరులో నలిగిపోతున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా అయో మయంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి తూర్పు నియోజకవర్గంలోకి పార్టీ బలో పేతం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతే కాకుం డా సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్య త ఇవ్వకుండా ఎన్నికల సమయంతో పాటు గెలిచిన తర్వా త పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత లభిస్తుండడంతో చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పాత తరానికి చెందిన సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజు సారయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఆయన పంచన చేరారు. మంత్రి సురేఖ వద్ద సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న కారణంతో ఎన్నికల సమయంలో ఆమె గెలుపునకు పనిచేసిన కాంగ్రెస్ నాయకులు సారయ్య వర్గంలోకి చేరికలు ప్రారంభమయ్యాయి. మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం, డీసీసీ అధ్యక్షుడిగా అయూబ్ నియామకం కావడంతో తూర్పు కాంగ్రెస్ సమీకరణాలు మారాయి. దీంతో తూర్పు కాంగ్రెస్ లో నాలుగు వర్గాలు తయారైనప్పటికి కొండా దంపతుల వర్గీయులకే నామినేటెడ్ పదవులు దక్కుతుండడంతో మిగిలిన ముగ్గురు నాయకులు ఒక్కటిగా మారారు. తూర్పులోని కాంగ్రెస్ పార్టీ కొండా దంపతుల నేతృత్వంలోని నాయకులు ఒక గ్రూపుగా, ఎమ్మెల్సీ సార య్య, డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్, మేయర్ గుండు సుధా రాణికి చెందిన నాయకులు మరో గ్రూపుగా మార డంతో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం రెండేళ్లుగా వేర్వేరుగా నిర్వహించుకుంటున్నారు. కేవలం కాంగ్రెస్ కు చెంది ఏగ్రూపునకు చెందని పార్టీ సీనియర్ నాయకులు ఈ వర్గాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కొండా సురేఖ ఇటీవల మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడంతో వ్యతిరేకవర్గం అనందోత్సవాలతో ఊగిపోతున్నది. ఏఐసీసీ సమావేశం ఉన్నందున సభ్యురాలైన కొండా సురేఖకు అందించేందుకు రాష్ట్ర పార్టీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసిన‌ట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొండా వర్గీయులు మంత్రిగా సురేఖ బర్తరఫ్ అయినప్పటికి ఏఐసీసీలో కొండా దంపతులకు ప్రత్యేక స్థానం ఉందని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టి హల్ చ‌ల్‌ చేశారు. ఏఐసీసీ నుంచి సురేఖకు పిలుపు వచ్చిందన్న సమాచారం సోషల్ మీడియాలో కొండా వర్గీయులు వైరల్ చేయడంపై వ్యతిరేక వర్గం నాయకులు టీపీసీసీ చీఫ్ తో అలాంటిది ఏమి లేదంటూ ప్రకటన ఇప్పించడంతో సఫలీకృతులయ్యారు. అయినప్పటికి తూర్పు లోని నాయకులు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోకపోవడాన్ని గుర్తించిన షాడో నేత తూర్పులో సమావేశం నిర్వహించాలని కొండా దంపతులను కోరడంతో తమ పట్టు నిరూపించుకునేందుకు మూడు రోజుల క్రితం వరంగల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొండా వర్గీయులు సురేఖను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్ ను చేశారు.

త్రిశంకు స్వర్గంలో జంపు జిలానీలు

బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లుగా గెలిచి సురేఖ మంత్రి కావడంతో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్లను ఆశించి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన జిలానీలకు ఆమె బర్తరఫ్ కావడం ఆనిశపాతంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున టిక్కెట్లు పొంది కార్పొరేటర్లుగా గెలవాలని ఆశలతో ఉన్న పార్టీ సీనియర్లకు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు అడ్డంకిగా మారారన్న అందోళనలతో ఉన్నారు. మారిన రాజకీయాలతో ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల జరిగిన సమావేశంలో కొండా మురళి అసలు కాంగ్రెస్ వాదులకే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇచ్చేది లేదని ప్రకటించడంతో పార్టీ మారిన నాయకుల గొం తులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. ప్రస్తుతం తమ పరిస్థితి ఏంటని, బీఆర్ఎస్ ను వీడినందున అక్కడ టిక్కెట్లు అడిగే అవకాశం లేకుండా పోయిందని, ఇప్పుడు కొండా దంపతులకు పార్టీలో ప్రాధాన్యత తగ్గితే టిక్కెట్లు ఇప్పించగలుగుతారో లేదో అన్న అనుమానంతో లోలోన మదనపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కొత్త నాయకులు ఈ రెండు పార్టీలను వదలి ఇతర పార్టీల నుంచి టిక్కెట్లు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *