ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల గ‌డువు 20 వరకు పొడిగింపు

– నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌ర్తింపు
– వరుస సెలవులు, పండుగల దృష్ట్యా నిర్ణయం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 15 :  ‘క్యూర్’ పరిధిలోని ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల‌ 20  వరకు పొడిగించారు. రెండో శనివారం, ఆదివారం, పండుగలు, ఇతర వరుస సెలవుల కారణంగా దరఖాస్తుల గడువును పొడిగించాలని వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయి. వాటిని పరిశీలించిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలని నిర్ణయించినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ బోర్డు కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. ప్ర‌స్తుతం చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, ముషీరాబాద్గో, గోషామహల్ పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాల ప్రజలు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకొని 20లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని గౌతమ్ విజ్ఞప్తి చేశారు. పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఇతర నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు tghb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572ను సంప్రదించవచ్చు.

—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *