– మూడు శిక్షణ కళాశాలల్లో 1,435మందికి ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 2: రాష్ట్ర పోలీసు శాఖలో 1,435 మంది సిబ్బందికి పదోన్నతికి ముందస్తు శిక్షణ సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మూడు పోలీసు శిక్షణ కళాశాలల్లో (పీటీసీ) సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగాలకు చెందిన సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 899 మంది సివిల్, 536మంది ఏఆర్ విభాగానికి చెందినవారు ఉన్నారు. మేడ్చల్ పీటీసీలో సివిల్ విభాగంలో 586మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కోసం శిక్షణ ప్రారంభించారు. కరీంనగర్ పీటీసీలో 313మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి శిక్షణ ఇస్తున్నారు. ఆర్మ్‌డ్ రిజర్వులో వరంగల్ పీటీసీలో 302మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా, 176మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆరఎస్సైలుగా పదోన్నతి శిక్షణ ప్రారంభమైంది. కరీంనగర్ పీటీసీలో మరో 58 మంది ఏఆరఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి శిక్షణ ఇస్తున్నారు. మేడ్చల్ పీటీసీలో జరిగిన కార్యక్రమానికి సాంకేతిక సేవలు, శిక్షణ విభాగం అదనపు డీజీపీ డాక్టర్ అకున్ సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీసు కమిషనర్ గౌష్ ఆలం, వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత పాల్గొన్నారు. ఉన్నత హోదాల్లో బాధ్యతలు చేపట్టనున్న సిబ్బందికి వృత్తిపరమైన పరిజ్ఞానం, విధి నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ శిక్షణ లక్ష్యమని అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





