లడ్డూ లడాయి
ఎవరి వారిదే బడాయి
భక్తుల మనోభావాలకు
విద్యుత్తు గాతం
గుడిని గుడి లింగాన్ని
మింగెవారిలో
దానవుల డి.యన్.ఏ. ఉందేమో!
వారికి బుద్ధి ముక్తి కలిగించేది
సత్ప్రవర్తన మాత్రమే…
లడ్డూ ప్రసాదం
రుచికి సుచికి పవిత్రతకు
భక్తి కి ముక్తి కి వరమని
విశ్వసనీయతకు నిదర్శనం…
ప్రసాదం
కల్తీ ,విషం అని సందేహించరు
విశ్వాసం తో తింటారు
ఎవరి పాపాన వారు పోతారని
కర్మసిద్ధాంతం తో ఓ నిట్టూర్పు
వదులు తారు
వారిది సడలని నమ్మకం
వారిది మహోన్నత ధర్మవిశ్వాసం
-రేడియమ్
9291527757