తెలంగాణ జర్నలిస్టుల గోస..

పుష్కరకాలం దాటినా మారని వివక్ష!

అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అన్యాయంపై ఆగ్ర‌హం..
ఏపీ కార్డుల్లో ఇక్కడి వారికి చోటుండదు.. తెలంగాణ కార్డుల్లో మాత్రం వారికే పెద్దపీట!
‘ఫ్యూచర్ సిటీ’ ఇళ్ల స్థలాల్లో ‘జెన్-జీ’ జర్నలిస్టులకు తొలి ప్రాధాన్యమివ్వాలి..

“రాష్ట్రం వొచ్చి పుష్కరకాలం అయిపోయిన అప్పటికీ తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితిలో మార్పు లేదు.  ప్రభుత్వంలో పలు శాఖలో ఎంతో కొంత మార్పులు వొచ్చినా తెలంగాణ జర్నలిస్టుల అణచివేత త‌గ్గ‌లేదు. కారణం తెలంగాణలో ఉన్నది మొత్తం సీమాంధ్ర మీడియా, సమైక్యవాదుల యాజమాన్యంలో నడుస్తున్నవే కావడం.  యాజమాన్యాలు సీమాంధ్రులు, వారి పాలసీలు వారి స్వప్రయోజనాలు, స్వరాష్ట్రం కోసమే అవుతాయి. తెలంగాణ వ్యతిరేక విధానాలే వారి ఎజెండా. తెలంగాణ అస్థిత్వం లేకుండా చేయడమే వారి పాలసీలు. గత కొంత కాలంగా అది ఓపెన్‌గానే వారి రాతల్లో, కట్టుకథల్లో స్పష్టంగా కనిపిస్తుంది..”
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం దాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఎవరి బతుకులు వారు బతుకుతూ, ఎవరికి నచ్చిన ప్రభుత్వాలను వారు ఎంచుకుంటున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విడిపోయినా కూడా అన్నదమ్ముల బంధం కొనసాగుతోంది. రాజకీయంగా ఆధిపత్య పోరాటాలు ఉన్నా, ప్రజల మధ్య మానవ సంబంధాల వైరం లేదు. 2014 జూన్ 2న అనేక ప్రజా పోరాటాలు, త్యాగాలు, యువత బలిదానాలతో సిద్ధించిన తెలంగాణకు, పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. 2024 జూన్ 2తో ఆ ఉమ్మడి పేగు బంధం కూడా అధికారికంగా తెగిపోయింది. విభజన చట్టంలోని కొన్ని అంశాలు, నీటి హక్కులపై వివాదాలున్నా, ప్రభుత్వాలు తమ రాష్ట్రాల సంక్షేమంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. అయితే, గత కొంతకాలంగా తెలంగాణ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం.. విభజన గాయాలను మరోసారి రేపుతూ, రాష్ట్రంలో కొత్త ‘సెంటిమెంట్’ నిప్పును రగిలిస్తోంది.
తెలంగాణ ప్రజల గోస, తెలంగాణ హక్కులకు అక్షర రూపమిస్తే.. జర్నలిస్టులను ప్రభుత్వాలు, సీమాంధ్ర మీడియా యాజమాన్యాలు అదే అణచివేసే విధానాలు అమలు చేస్తోంది. జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డులు, ప్రభుత్వ రాయితీలు, ఇళ్ల స్థలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, సీమాంధ్ర మీడియా యాజమాన్యాలు తెలంగాణ జర్నలిస్టులకు ఎలా అన్యాయానికి గురిచేస్తున్నారో గమ‌నిస్తే మ‌న‌ల్ని క‌ల‌వ‌ర‌పెడ‌తాయి. అక్రిడిటేషన్‌ కార్డుల విష‌యంలో  ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ప్రెస్‌ అకాడమీ ఉంటుంది..ఈ మీడియా అకాడమీ ఆయా రాష్ట్రాల జర్నలిస్టుల హక్కులను రక్షిస్తుంది. ప్రభుత్వ రాయితీలు సొంత రాష్ట్ర జర్నలిస్టులకు అందేలా కృషి చేస్తాయి. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఒక్కటే, తెలంగాణ ప్రెస్‌ అకాడమీకి తెలంగాణ జర్నలిస్టుల పట్ల ప్రేమ లేకపోవడం..రాష్ట్రం ఏర్పడి ప్రత్యేకంగా ప్రెస్‌ అకాడమీ ఏర్పడింది. కానీ ఇంకా ఆ అకాడమీ ఆలోచనలో మాత్రం ఉమ్మడి విధానాలే కనిపిస్తున్నాయనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
జర్నలిస్టులకు ప్రభుత్వం ఐ అండ్ పీఆర్‌ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తుంది. మీడియా అకాడమీ సలహాలు సూచనలు మేరకు ప్రభుత్వం అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తుంది. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్‌ కార్డు అనేది ఒక అధికారిక గుర్తింపు..జర్నలిస్టు స్థాయిని పెంచుతుంది. అలాంటి కార్డుల మంజూరులో తెలంగాణ జర్నలిస్టులకు వివ‌క్ష ఎదుర‌వుతోంది.తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్‌ కార్డుల్లో నూటికి 90 శాతం ఏపీ జర్నలిస్టులకే ప్రభుత్వం ఇస్తుంది.. ఇదేంటని ప్రశ్నిస్తే అది మీ యాజమాన్యాలను అడగండి అంటూ ఉమ్మడి ఏపీలో నాటి వెకిలి సమాధానాలు అధికారుల నుంచి తెలంగాణ జర్నలిస్టులు ఎదుర్కొవల్సి వస్తుంది. మీడియా సంస్థలు రెకమెండ్ చేసిన వారికే అక్రిడిటేషన్‌ కార్డులు ఇస్తున్నామని సమాధానాలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మీడియా అకాడమీ అనేది మీడియా సంస్థలు చెప్పినట్లు నడుచుకునే వ్యవస్థలా..? అకాడమీకి స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్వతంత్రత లేదా..?.తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మీడియా అకాడమీ తెలంగాణ జర్నలిస్టుల కోసం కాకుండా సీమాంధ్ర మీడియా హౌస్‌ ల కోసం ఇక్కడ పని చేస్తున్నాయా..? అంటూ అనేక ప్రశ్నలు తెలంగాణ జర్నలిస్టుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

ఉమ్మడి ఏపీలో సీమాంధ్ర మీడియాలో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.. అణచివేతలు, అవహేళనలు, తెలంగాణ భాషపై వ్యంగ్యాలు అన్నీఇన్నీ కాదు. అసలు తెలంగాణ అన్న పదమే సీమాంధ్ర మీడియా నిషేధించింది. సంస్థల్లో జర్నలిస్టులను కించపర్చేలా మాట్లాడుతూ అంటరాని వారిగా చూసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. అందుకే తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు చాలా క్రియాశీల‌కంగా పాల్గొన్నారు. సీమాంధ్ర మీడియా యాజమాన్యాలు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా స్వరాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారు.

రాష్ట్రం వొచ్చి పుష్కరకాలం అయిపోయిన అప్పటికీ తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితిలో మార్పు లేదు.  ప్రభుత్వంలో పలు శాఖలో ఎంతో కొంత మార్పులు వొచ్చినా తెలంగాణ జర్నలిస్టుల అణచివేత త‌గ్గ‌లేదు. కారణం తెలంగాణలో ఉన్నది మొత్తం సీమాంధ్ర మీడియా, సమైక్యవాదుల యాజమాన్యంలో నడుస్తున్నవే కావడం.  యాజమాన్యాలు సీమాంధ్రులు, వారి పాలసీలు వారి స్వప్రయోజనాలు, స్వరాష్ట్రం కోసమే అవుతాయి. తెలంగాణ వ్యతిరేక విధానాలే వారి ఎజెండా. తెలంగాణ అస్థిత్వం లేకుండా చేయడమే వారి పాలసీలు. గత కొంత కాలంగా అది ఓపెన్‌గానే వారి రాతల్లో, కట్టుకథల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మీడియా అకాడమీ ఏం చేయాలి..తెలంగాణ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.. సీమాంధ్ర మీడియా సమైక్యవాదులదే కావచ్చు.. కానీ అవి నడుస్తున్నవి తెలంగాణ గడ్డ నుంచి ఇక్కడ నుంచి నడుస్తున్న మీడియాలో పని చేస్తున్న తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉండకపోతే ఎలా? తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందంటే అది యాజమాన్యాలను అడగండి అంటే మరీ ప్రభుత్వం, మీడియా అకాడమీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు..?.

తెలంగాణ కేంద్రంగా నడుస్తున్న మీడియా సంస్థలు తప్పని తెలంగాణ ప్రభుత్వ పాలసీలకు అనుకూలంగా ఉండాలి. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ గైడ్ లైన్స్‌ పాటించాలని ఆదేశాలు ఇవ్వొచ్చు కదా.. వార్తల ప్రచారం విషయంలో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్దం. కానీ ప్రభుత్వ పాలసీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వొచ్చు కదా. రాష్ట్రంలో నడుస్తున్న మీడియా హౌస్‌లు ఎవరివైనా, ఏ ప్రాంతానికి చెందినవైనా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మీడియా అకాడమీ ఇచ్చే రాయితీలు మాత్రం తెలంగాణ జర్నలిస్టులకే చెందాలని ఒక పాలసీ తీసుకురావచ్చు కదా.?

తెలంగాణ ప్రభుత్వం మీడియా సంస్థలకు ఇచ్చే రాయితీలను సీమాంధ్ర మీడియా  ఉపయోగించుకుంటుంది.. కనీసం అక్రిడిటేషన్‌ కార్డుల విషయంలో అయిన తెలంగాణ జర్నలిస్టులకు న్యాయం చేయోచ్చు కదా..ప్రెస్‌ అకాడమీ ఇచ్చే గుర్తింపు కార్డులు తెలంగాణ జర్నలిస్టులకు ఇవ్వాలనే చట్టం తీసుకురావచ్చు కానీ ప్రభుత్వం అలా చేయదు. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్టులకు గుర్తింపు ఇస్తే ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు..పాలసీలపై మాట్లాడుతారు.అందుకే అలాంటి పాలసీలు తీసుకురావు.  తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు సీమాంధ్ర మీడియాలో మేజార్టీ ఏపీ జర్నలిస్టులకే ఇస్తున్నారు. ఎందుకంటే వారికి ప్రాంతీయాభిమానం.తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో తమ ప్రాంతం వారే లబ్దిపొందాలనే కుట్రలు.

అయితే తమ సంస్థలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఏపీ జర్నలిస్టులు ఇక్కడ పని చేస్తున్నారు కాబ‌ట్టి తెలంగాణ అక్రిడేషన్లు ఏపీకి చెందిన వారికి ఇస్తున్నామని ప్రాంతాలతో సంబంధం లేదని సమర్థించుకోవచ్చు. మరి ఏపీ ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్‌ కార్డుల్లో తెలంగాణలో పని చేసే జర్నలిస్టులకు ఎందుకు పెట్టాలి.? వాళ్లు ఇక్కడే పని చేస్తున్నారు కదా. మరీ ఏపీ ప్రభుత్వం కార్డుల్లో కూడా వారి పేరే ఎందుకు.?  డెస్క్‌లో పని చేసే డెస్క్‌ జర్నలిస్టులకు తెలంగాణ కోటా ఇచ్చినట్లే, మరీ ఏపీ ప్రభుత్వం ఇచ్చే కార్టుల్లో తెలంగాణ డెస్క్‌ జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వడం లేదు.? అసలు ఏపీ ప్రభుత్వం చేత వారు తమ రాష్ట్ర జర్నలిస్టులను గుర్తింపు పొందిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వారికి జర్నలిస్టుల కోటాలో రాయితీలు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం, ప్రెస్‌ అకాడమీ ఆలోచించాలి.

తెలంగాణ జర్నలిస్టులకు అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంకా వివక్ష కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డులో తెలంగాణ జర్నలిస్టులకు యాజమాన్యాలు అవకాశం ఇవ్వవు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల్లో ఏపీ జర్నలిస్టులకు యాజమాన్యాలు అవకాశం ఇస్తాయి. కానీ ఏపీ సర్కారు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల్లో తెలంగాణ జర్నలిస్టులకు అవకాశం ఇవ్వవు.

యాజమాన్యాలు చెప్పినట్లు మీడియా అకాడమీ చెప్పుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్‌లు సీమాంధ్ర జర్నలిస్టులకు ఇచ్చినట్లే, మరీ ఏపీ ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషనలు కార్డుల్లో ఎంత మంది తెలంగాణ జర్నలిస్టులకు యాజమాన్యాలు ఇస్తున్నాయి..మరీ ఈ వివక్షను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదా..? మీడియా అకాడమీకి మాట్లాడే బాధ్యత లేదా..?.తెలంగాణ సర్కార్‌ ఇచ్చే కార్డుల్లో ఏపీ వారికి పెట్టినట్లే, ఏపీ ఇచ్చే కార్డుల్లో తెలంగాణ వారికి ఇవ్వాల్సిందేనని రివ్యూ చేసి ఆదేశాలు జారీ చేసే బాధ్యత నుంచి మీడియా అకాడమీ ఎందుకు తప్పుకుంటుంది.?

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డులో ఏపీ జర్నలిస్టు మిత్రులు అవకాశం ఇవ్వాలి. కానీ అలా ఇవ్వరు కారణం వివక్ష, ఆధిపత్యం. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ స్థలాల్లో తెలంగాణ జర్నలిస్టులకు అంగుళం భూమి ఇవ్వలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఫోర్త్ సిటీలో మాత్రం ఏపీ ప్రభుత్వం చేత గుర్తించబడిన జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలి..?.
తెలంగాణ ఏం ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో లేదు. ఉమ్మడి రాజధాని కూడా కాదు. మరీ ఏపీ సర్కారు గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ప్రజల భూమి అప్పనంగా ఫ్రీ గా ఎందుకివ్వాలి.?  తెలంగాణ అక్రెడిటేషన్ కార్డులో ఏపీ జర్నలిస్టుల పేర్లే పెట్టి, ఏపీ ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డులో ఏపీ జర్నలిస్టులకే ఇస్తే మరీ తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితి ఏంటి.?.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డులు రాయితీలు, సంక్షేమం తెలంగాణ జర్నలిస్టులకే ఇవ్వాల‌ని యాజమాన్యాలకు ప్రెస్ అకాడమీ క్లియర్ గా చెప్పాలి. అంతేకాదు జర్నలిస్టులకు హద్దులు లేవు, వార్తకు ఎల్లలు లేవని చెప్పదలచుకుంటే. ఏపీ జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ రాయితీలు, సంక్షేమం అక్కడ తెలంగాణ జర్నలిస్టులకు వర్తింపచేయాలి.  తెలంగాణ ప్రభుత్వం ఏపీ జర్నలిస్టులకు ఏ విధంగా అక్రెడిటేషన్ కార్డు, రాయితీ, ఇళ్ల స్థలాలను ఇవ్వాలి చూస్తుందో ఏపీ ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టులకు ఇవ్వాలి.

రెండు రాష్ట్రాల లబ్ధిదారులు.. చెక్ పెట్టాల్సిన సమయం:

సొసైటీల్లో ఉన్న వారికే ఇళ్ల స్థలాలన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే జెన్‌ జీ జర్నలిస్టులు పెద్దగా ఏ సొసైటీలో లేరు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, 70లో ఏర్పాడిన సొసైటీల్లో మాత్రమే సీనియర్‌ జర్నలిస్టులు ఉన్నారు. కొన్ని సొసైటీలైతే గతంలో ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు కూడా పొందారు ఏకంగా హైదరాబాద్‌లో జర్నలిస్టుల కాలనీలు కూడా వెలిశాయి. అయితే జర్నలిస్టుల సొంత డబ్బులతో సొసైటీలుగా ఏర్పాడిన ప్రభుత్వం రాయితీలు అయితే పొందారు.

కానీ ఇవాళా జెన్‌ జీ జర్నలిస్టులకు సొసైటీ లేదు. జర్నలిస్టుల సంఘాల్లో కూడా తక్కువ మంది చేరుతున్నారు. కారణాలేవైన కావొచ్చు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొంతమంది జర్నలిస్టులు ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు కూడా పొందారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
తెలంగాణ ప్రెస్ అకాడమీ అండ్ జర్నలిస్టు సంఘాలకు నా విజ్ఞప్తి ఎంటంటే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తామన తలపెట్టిన ఆలోచనలో జెన్‌ జీ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వండి..సొసైటీలో ఉన్న జర్నలిస్టులు గతంలో ఎంతో కొంత ప్రయోజనాలు జరిగాయి.ఇప్పుడు  సొసైటీలో ఉన్న జర్నలిస్టులతో పాటు సొసైటీలో లేని జెన్‌ జీ జర్నలిస్టులకు కూడా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి.

సొసైటీలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీం కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా ఏదో రూపంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌. అయితే ఈ సందర్భంగా మరో విజ్క్షప్తి కూడా చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటుందన్న ఊహాగానాల మధ్య  ఏ సొసైటీలో లేని జర్నలిస్టులు తమకు కూడా ఏదో రూపంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. తెలంగాణలో పని చేస్తున్న జర్నలిస్టులు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఏపీకి చెందిన జర్నలిస్టులు సోదరులు తెలంగాణలో పని చేస్తున్నారు..అయితే వారు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు  సంక్షేమ రాయితీలు పొందుతున్నారన్న చర్చ ఉంది..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాయితీ కూడా పొందాలనే ఉద్దేశ్యం కూడా వారిలో ఉంది.
అందుకే నేను చేసే విజ్ఞప్తి ఎంటంటే. ఏపీలో ప్రభుత్వ రాయితీలు పొందిన ఏపీ జర్నలిస్టుల మిత్రులకు సెంకడ్ ప్రీయార్టీ ఇచ్చి తెలంగాణ జర్నలిస్టులకు ఫస్ట్ ప్రియార్టీ ఇవ్వాలని విజ్క్షప్తి చేస్తున్నారు..ఎందుకు కంటే కొంత మంది జర్నలిస్టులు అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు ప్రభుత్వాల్లో ప్రయోజనాలు పొందుతున్నారని, దాని వల్ల తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నా విమర్శలు కూడా ఉన్నాయి. ఏపీ మిత్రులు తెలంగాణ ప్రభుత్వం రాయితీ పొందుతున్నారు. కానీ తెలంగాణ జర్నలిస్టులు ఏపీ ప్రయోజనాలు పొందే అవకాశం లేదు.దీని వల్ల తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.

రెండు రాష్ట్రాల ప్రెస్‌ అకాడమీ చైర్మన్లు, జర్నలిస్టు సంఘాలు కూర్చోని ఏపీలో ప్రయోజనాలు అవి అక్రిడిషన్‌ అయినా, ఇళ్ల సంస్థలైన, హెల్త్ స్కీమ్స్‌ అయిన అక్కడ లబ్ది పొందింతే అలాంటి జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాయితీల నుంచి మినహాయించండి. అటు ఏపీ ఇటు తెలంగాణ అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు చాలా మంది ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే రెండు రాష్ట్రాల చైర్మన్లు, సంఘాలు కూర్చోని ఫిల్టర్‌ చేయండి..ఏపీలో ఎలాంటి లబ్ది పొందని వారికి తప్ప కుండా తెలంగాణలో ఇవ్వండి.  తెలంగాణ జర్నలిస్టుల్లోనూ జెన్‌ జీలకు ప్రాధాన్యమివ్వాలి. ఏపీ జర్నలిస్టుల‌కు రెండో ప్రాధాన్య‌త ఇవ్వొచ్చు.  ఏపీ మిత్రులకు ఎలాగూ అక్క‌డి ప్రభుత్వంలో అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణ ఉద్యమకారుడిగా, జెన్ జీ జర్నలిస్టుగా నా విజ్ఞప్తి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *