వసంతం రుతువుల మార్పుతో
రాదు వాన చినుకులతోనే వచ్చు
భూ బాహువులలో బలమేంత వున్నా
మేఘాలు పుడమిని తాకక ఫలమేముంది
భువి కాఠిన్యతను కరిగించుటకు
దివి మేడనేక్కి దూకే చినుకులు కావాలి
ఘనమైన వాన కురవాలివాన గుర్తులున్నంత కాలం
లేదు ప్రకృతికీ దీనకాలం
వాన దీర్ఘ తపస్సు లో వున్నా
వారేందరీనో మేల్కోలుపు
మఱ్ఱిచేట్టు వ్యాపించినట్లు
వాన విశ్వమంతా కురవాలి
రాదు వాన చినుకులతోనే వచ్చు
భూ బాహువులలో బలమేంత వున్నా
మేఘాలు పుడమిని తాకక ఫలమేముంది
భువి కాఠిన్యతను కరిగించుటకు
దివి మేడనేక్కి దూకే చినుకులు కావాలి
ఘనమైన వాన కురవాలివాన గుర్తులున్నంత కాలం
లేదు ప్రకృతికీ దీనకాలం
వాన దీర్ఘ తపస్సు లో వున్నా
వారేందరీనో మేల్కోలుపు
మఱ్ఱిచేట్టు వ్యాపించినట్లు
వాన విశ్వమంతా కురవాలి
పశు పక్ష్యాదులు పచ్చిక బైళ్లు
పచ్చటి అడవులు కష్టించే రైతులు
మేచ్చేటి వాన కురవాలి
ఇరానీ కేఫ్ లో గరం చాయ్ లా
చరించే చైతన్యం ఇచ్చే
చిక్కటి వాన కురవాలి
పచ్చటి పోలాలను తివాచీలా
మట్టి పరిమళాలాలను మిఠాయిలా
ముచ్చటలా వాన కురవాలి
రుతువులా మారే జీవితంలో
శిశిరంలో వసంతం ఇచ్చే
మచ్చలేని వాన కురవాలి
బయట కురిసే వర్షం
ప్రతి మనిషీ హృదయంలో కురవాలి
ఆత్మలోని మలినాలు చినుకులలో
తడిసి దహనమైపోయేంతటి
వేచ్చటి వాన కురవాలి
-ఐ.చిదానందం