– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం ప్రకటించారు. ఆదిలాబాద్‌లోని వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న శిశువుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే వారిని హైదరాబాద్‌లోని పెద్ద హాస్పిటల్స్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రిమ్స్‌లో 150 బెడ్ల మాతా శిశు ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన పనులు మొదలు పెట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. అత్యాధునిక వసతులతో ఎంసీహెచ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాగా, రివమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతిచెందిన శిశువల సంఖ్య 5కు చేరింది. మంగళవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా చికిత్స పొందుతూ బుధవారం మరో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఇప్పటికే అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





