అం‌దరూ నాగోబాను దర్శంచుకోండి..

  • జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం..
  • భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతరను అయిదు రోజుల పాటు వేడుకగా సాగుతుందని, భక్తులు నాగోబాను దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *