హన్మకొండ, ప్రజాతంత్ర : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్, బాలసముద్రం, హనుమకొండ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 02 బుధవారం సాయంత్రం నిర్వహించే పితృఅమవాస్య బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఏకశిలా పార్క్ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వైపు బతుకమ్మ పండుగ వేడుకలకు అనుకూలంగా లైటింగ్, సౌండ్ సిస్టం, తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంపిక చేసిన బతుకమ్మలకు. కోలాటంలో నైపుణ్యం ప్రదర్శించిన మహిళలకు అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేయనున్నారు. బాలసముద్రం, అడ్వకేట్స్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, నక్కలగుట్ట తదితర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో వొచ్చే నెల 2న బుధవారం సాయంత్రం నిర్వహించే బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో ఏకశిలా పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంగ రాజిరెడ్డి ,గౌరవ అధ్యక్షులు చాడ దశరథ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పడాల సోమయ్య, కోశాధికారి సుంచికాల రవీందర్రావు, ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి రాజిరెడ్డి, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పచ్చిమట్ల ఎల్లా గౌడ్ గారు వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు భయాగాని కుమారస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ
