ర‌ష్యా స‌ర‌కు ర‌వాణా నౌక‌పై డ్రోన్ దాడి

– మంట‌ల్లో నౌక‌.. సుర‌క్షిత ప్రాంతానికి సిబ్బంది త‌ర‌లింపు
– స‌హాయక చ‌ర్య‌లకు స‌న్నాహాలు

న్యూదిల్లీ, న‌వంబ‌ర్ 21 : ర‌ష్యా తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఫిన్‌లాండ్ జలాల్లో రష్యాకు చెందిన ఓ సరకు రవాణా నౌకపై తాజాగా డ్రోన్ దాడి జరిగింది. కాలినిన్‌గ్రాడ్ వైపు వెళుతుండగా ఈ దాడి జరిగిందని రష్యా అధికారులు శ‌నివారం తెలిపారు. నౌక సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నామని, ఎంత నష్టం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని లెనిన్ గ్రాడ్ ప్రాంతీయ గవర్నర్ డ్రోజ్‌డెన్కో తెలిపారు. ఫిన్లాండ్‌లోని ఇతర అధికారులు, అంతర్జాతీయ అధికారుల సహకారంతో సహాయక చర్యల కోసం సన్నాహాలు జరుగుతున్నాయ‌ని ఫిన్నిష్ సరిహద్దు రక్షక దళం ఒక ప్రకటనలో తెలిపింది. దాడి తరువాత నౌకలో మంటలు ఎగసిపడుతున్నాయని ఫిన్‌లాండ్ పేర్కొంది. నౌక తమ పరిధిలోని సముద్ర జలాల్లోకి కొట్టుకొచ్చిందని వెల్లడించింది. అయితే, ఈ ఘటనతో అక్కడ సముద్రయానానికి ఎలాంటి అవాంతరాలు లేవని లినిన్‌గ్రాడ్ గవర్నర్ అలెక్సీ బెస్‌ప్రోజ్‌వన్నిఖ్ తెలిపారు. ఇదిలా ఉంటే, తాము ఇప్పటివరకూ 80కి పైగా డ్రోన్ దాడులను అడ్డుకున్నామని డ్రోజ్‌డెన్కో చెప్పారు. డ్రోన్ ముప్పు హెచ్చరికను ఉపసంహరించుకున్నామని కూడా తెలిపారు. బాల్టీక్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రష్యా భూభాగాన్ని కాలినిన్‌గ్రాడ్ అని పిలుస్తారు. ఐరోపా దేశాలైన పొలాండ్, లిథువేనియా మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం కారణంగా అప్పుడప్పుడూ రష్యా, ఐరోపా సమాఖ్య, నాటో కూటమిల మధ్య అభిప్రాభేదాలు తలెత్తుతుంటాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *