సనత్ నగర్ టిమ్స్ ట్రయల్ రన్ విజయవంతం

– కార్డియాక్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ హబ్‌గా మార్చండి
– ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: పేషెం ట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే లా సనత్నగర్ టిమ్స్న తీర్చిదిద్దాలని ఆరో గ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామో దర్ రాజనర్సింహ ఆదేశించారు. సనతనగ ర్ టిమ్స్ జరుగుతున్న వైద్య సేవల ట్ర యల్ రన్పై మంత్రి సోమవారం రివ్యూ, చేశారు. సెక్రటేరియట్ లో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యద ర్శి క్రిస్టినా జడ్ చొంగు, జాయింట్ సెక్రటరీ అయేషా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమి షనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీజీ ఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రయల్ రన్ లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివ రాలను, ఎదురవుతున్న ఇబ్బందులు, లోపా లను అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా.. ఓపీ రిజిస్ట్రేషన్, కన్సల్టేష న్ రూమ్లు, వెయిటింగ్ ఏరియా, డయా గ్నస్టిక్స్, రేడియాలజీ డిపార్ట్మెంట్, ఇన్పే షెంట్ డిపార్ట్మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. ట్రయల్ రన్లో భాగంగా 22 డిపార్ట్మెంట్లలో ఓపీ సేవలు అందిస్తున్నా మని అధికారులు తెలిపారు. ఆపరేషన్ థి యేటర్లు శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయ న్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ , డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్స్టా లేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. డయాగ్న స్టిక్స్ యంత్రాలు ఇన్స్టాలేషన్ పూర్తి అయిం దని తెలిపారు. ట్రయల్ రన్లో భాగంగా టెస్టు లు నిర్వహిస్తున్నా మని చెప్పారు. సనత్నగర్ టిమ్సు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డి యాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ ఆర్గాన్
ట్రాన్స్ ప్లాంటేషన్గా తీర్చిదిద్దాలని గతంలోనే అధికారులకు మంత్రి సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్నిరకాల గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా, అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించేలా క్యాథల్యాబ్స్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ థియేటర్ల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. క్యాథల్యాబ్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయని, ట్రయల్ రన్కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరిం చారు. మెడికల్ సర్వీసెస్తో పాటు సానిటేష న్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మం త్రి ఆదేశించారు. పేషెంట్లు, వారి అటెం డెంట్లకు భోజన సదుపాయం కల్పించాలని, అటెండెంట్ల కోసం ధర్మశాలను సైతం సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *