– బుగ్గవాగు ఎత్తిపోతల పనుల్లో ఆలస్యం ఎందుకు?
– ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రోత్సహించండి
– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దివాకర, సిపి సునీల్ దత్లతో కలిసి ఖమ్మం నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మంచుకొండ ఎత్తిపోతల పథకం పరిధిలోని అన్ని చెరు వులను నింపేలా చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. బుగ్గవాగు ఎత్తిపోతల పథకం పనులు చాలా కాలంగా ఆలస్యమ వుతున్నాయని, పనులను వెంటనే ప్రారంభించాలని సూచిం చారు. మున్నేరు రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు అవసరమైన 10-ఏ మిన హాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 15 వరకు అధికారులు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. కాలువలు, షట్టర్లు, నీటి మట్టాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వచ్చే సీజన్ నుంచి అన్ని నిర్వహణ పనులను వేసవిలోనే పూర్తి చేయా లని ఆదేశించారు. కేబుల్ బ్రిడ్జి పనులకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉ న్నందున పనులను త్వరగా పూర్తి చేయాల ని, నవంబర్లో హ్యాండోవర్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెలుగుమట్ల కాలనీలోని అన్ని ఇళ్లను నవంబర్ 21లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రోడ్లు. అంగన్వాడీ కేంద్రం, విద్యుత్ లైన్లు, డ్రైనేజీ తదితర అన్ని మౌళిక వసతుల పనులను పూర్తి చేసి కాలనీని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసేలా ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజనను అనుసంధా నం చేయాలని ఆదేశించారు. ఖమ్మం నగరానికి వచ్చే పదేళ్లలో అవసరమయ్యే విద్యు తన్ను అంచనా వేసి సబ్ స్టేషన్లను ప్రణాళిక చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో విద్యుత్ కేబుళ్లతో పాటు అవసరమైన ఇతర కేబుళ్లను భూగర్భంలో ఏర్పా టు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





