– ఉపముఖ్యమంత్రిగా జి. పరమేశ్వర్
- మొత్తం 13 మంది మంత్రుల ప్రమాణం
– సిద్దరామయ్య, ఖర్గేల తనయులకు కేబినేట్‌లో చోటు
– హాజరైన రాహుల్, ఖర్గే, వేణుగోపాల్, రేవంత్ రెడ్డి
బెంగళూరు,జూన్ 3:కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. డీకే శివకుమార్‌తో గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న జి.పరమేశ్వర కర్ణాటక ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యాంగం మినీబుక్‌ను చేతబట్టి డీకే ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు వేదికపై నుంచి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తన సీనియర్ అయిన సిద్ధరామయ్యను వేదికపైనే డీకే సత్కరించారు.జి. పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా, మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రివర్గంలో చోటుదక్కింది. డీకే శివకుమార్ క్యాబినెట్ మంత్రులు 13 మంది చేత గవర్నర్ గెహ్లాట్ తావర్‌చందర్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో కేజీ జార్జ్, జి.పరమేశ్వర, రామలింగా రెడ్డి, కృష్ణ బైరే గౌడ, యూటీ ఖాదెర్, ఎంబీ పాటిల్, సతీశ్ జార్కిహోళి, ప్రియాంక ఘర్గే, యతీంద్ర సిద్ధరామ్యయ, లక్ష్మీ హెబ్బాల్కర్ ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులు వీడీ సతీశన్, ఎ.రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ సుఖు, డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్, కుమార్తె, పలువురు ఆధ్యాత్మిక నేతలు, విద్యార్థి, పౌరకార్మిక, రైతు ప్రతినిధులు, దళిత నేతలు, కన్నడ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





