పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు

– రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక
– ఆరెంజ్‌ అలర్ట్ ‌జారీ చేసిన అధికారులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 3: రాష్ట్ర ‌ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌, ‌కుమురంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హనుమకొండతో కలిపి మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ’ఆరెంజ్‌’ అలర్ట్ ‌ప్రకటించారు.  ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఈ భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. రాబోయే రెండు రోజులు మరిన్ని భారీ వర్షాలు పడనున్నందున, ముఖ్యంగా రైతులు, గ్రాణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

నేడు కేరళను తాకనున్న నైరుతి

నైరుతి రుతుపవనాలు రాబోయే 24 గంటల్లో కేరళంలోకి ప్రవేశించ నున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తద్వారా క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి. గురువారం నైరుతి రుతుపవనాలు.. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, లక్షద్వీప్‌ ‌దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ ఉత్తర్‌‌ప్రదేశ్ ‌మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్యప్రదేశ్‌ ‌నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ దుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది.  కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *