మౌలిక వసతుల కల్పనలో విఫలం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులకు పరామర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యా ప్రమా ణాలు దిగజారిపోయాయని, విద్యాసంస్థలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు బాలిక లను నిమ్స్‌కు తీసుకురాగా హరీష్ రావు మంగ ళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీమ్స్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థిని మహాలక్ష్మి కోలుకుం టోందని, తొమ్మిదో తరగతి విద్యార్థిని జ్యోతి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు డాక్టర్లు యత్నిస్తున్నారని తెలిపారు.9వ తరగతి విద్యా ర్థిని శైలజ వెంటిలేటర్‌పై చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పానన్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పి స్తున్నారు.. అయితే గత పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో తల్లి తండ్రుల నమ్మకాన్ని పోగొట్టే విధంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిస్థితులు దిగజారాయి. రెసిడెన్షియల్ స్కూళ్లలో సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
ఇప్పటివరకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్ధులు వివిధ కారణాలతో చనిపో యారు. ఇది చిన్న విష యం కాదు ..ఏవరేజ్‌గా నెలకు ముగ్గురు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులు మరణిస్తు న్నారంటే ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచి ంచాలి. దాదాపు 600 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ ఫాయిజనింగ్ బారినపడ్డారు. పాములు, ఎలుకల కాట్ల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పిల్లలకు కరెంట్ షాక్‌లు కూడా కామన్ అయిపోయాయి ఇటీవలనే మెదక్ హవేలీ ఘన్ పూర్ బాలికల రెసిడెన్షి యల్ స్కూల్ లో పిల్లలకు కరెంట్ షాక్ తగిలి హాస్పిటల్‌లో చేరింది. సీఎం, మంత్రులు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల బిజీలో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లపై పట్టించుకునే తీరిక వారికి ఎక్కడ ఉంది? అని ఎద్దేవా చేశారు. 36 మంది రెసిడెన్షియల్ విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే అని అన్నారు. ఈ మరణాలపై ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ సమీక్షలు జరగడం లేదన్నారు.
కేసీఆర్ హయాంలో 1023 ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. కేసీఆర్ హయాలో రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు అత్యున్నత సంస్థల్లో అడ్మిషన్లు పొందారు ..డాక్టర్లు ఇంజినీర్లు పైలట్ లు ,ఐఏఎస్, ఐపీఎస్ లు అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎలుకలు విద్యార్థులను కరిచే స్థాయికి తీసుకుపో యారన్నారు. విద్యార్థులు జబ్బు పడితే కనీస మందులు అందుబాటులో లేవు. విద్యార్థులు పాములు, ఎలుకల బారిన పడుతున్నారు ..వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులు పడుకు నేందుకు కనీసం మంచాలు లేవు ..కింద పడుకోవడం వల్ల పాము కాట్ల బారిన పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కి రెసిడెన్షియల్ స్కూళ్ల పై సదాభిప్రాయం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల ను మూసివేసే కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తోంది. రాజకీయాల జోలికి పోకుండా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి భేషజాలకు పోకుండా రెసిడెన్షియల్ స్కూళ్ల కున్నపేరును పాడు చేయొద్దని హరీష్‌రావు హితువు పలికారు.





