– జీవో 118, 76 తర్వాత మరో కీలక నిర్ణయం
– అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం
– తక్షణమే రిజిస్ట్రేషన్ చేసేలా ఉత్తర్వులు జారీ
– సీఎం హామీ మేరకు 22-ఎ సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారాలు
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
– అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం
– తక్షణమే రిజిస్ట్రేషన్ చేసేలా ఉత్తర్వులు జారీ
– సీఎం హామీ మేరకు 22-ఎ సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారాలు
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22- ఎ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు సహచర మంత్రులతో చర్చించి 22-ఎ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందన్నారు.
ప్రభుత్వ అనుమతులున్న ఆస్తులకు రిజిస్ట్రేషన్లకు మార్గం
22-ఎలో ఉన్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తూ రెవెన్యూ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక సంస్థలు, డీటీసీపీ లేదా ఇతర పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నుంచి చెల్లుబాటయ్యే లేఅవుట్, భవన నిర్మాణం లేదా అపార్ట్మెంట్ అనుమతులు పొందిన ఆస్తులకు ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. అనుమతి పొందిన అనంతరం జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదో ఒక లింక్ డాక్యుమెంట్ తప్పనిసరిగా దరఖాస్తుదారులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
జిల్లాస్థాయిలో సమస్యల పరిష్కారానికి కమిటీ
ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కమిటీలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ట్రార్, హెచ్ఎండీఏ/పురపాలక సంస్థ/గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధి సభ్యులుగా ఉంటారని తెలిపారు. 22-ఎ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే అమలులోకి వచ్చిన నిర్ణయాలే నిదర్శనమని అన్నారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోని దాదాపు 64 కాలనీల ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యకు జీవో 118కు అనుగుణంగా మెమో జారీ, దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను కూడా ప్రభుత్వం జీవో 76 ద్వారా పరిష్కరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. భూమి, ఇల్లు వంటి అంశాల్లో ప్రజలు ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి ముగింపు పలకడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను కేవలం ఫైళ్లకే పరిమితం చేయకుండా ప్రజలకు ప్రత్యక్షంగా ఉపశమనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి తెలిపారు. 22-ఎలోని అన్ని భూములను ఒకే గాటన కట్టకుండా భూమి స్వభావం, అందుబాటులో ఉన్న రికార్డులు, చట్టబద్ధమైన అనుమతులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి అర్హమైన సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





