– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దళితులు కోరుకునేది ఆత్మగౌరవం, సమానత్వం, భద్రత అని ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలను ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందని, బాధితులకు సత్వర న్యాయం, పరిహారం, పునరావాసం అందేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం-1989పై రాష్ట్రస్థాయి ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2023 నుంచి ఇప్పటివరకు 7,563 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులు నమోదయ్యాయన్నారు. బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానల్‌లో సత్వరమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాసంపై సీఎం స్వయంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. గత పదేళ్లలో బీఆరఎస్ ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. దళితులపై దాడులు, అత్యాచారాలు, వేధింపుల విషయంలో గత ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదన్నారు. ఇటీవల దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఘటనపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకునేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లకు ప్రతి నెలా మొదటి వారంలో కాస్మెటిక్ చార్జీలు, మెస్ చార్జీలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చదువొక్కటే జీవితాలను మార్చగలదుంటూ అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించాలి అని సూచించారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధిని రాజకీయాలకతీతంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి అడ్లూరి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





