Category తెలంగాణ

మజ్లిస్‌ ‌కోసమే పోటీకి బీఆర్‌ఎస్‌ ‌దూరం

ఏ ప్రాతిపదికన పోటీకి దూరంగా ఉన్నారో చెప్పాలి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌21: ‌నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఎం‌దుకు పోటీ చేయడంలేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ‌చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. అత్యధిక వోట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో…

భూభార‌తితో భూ స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్కారం

వొచ్చేనెల నుంచి గ్రామ‌ప‌రిపాల‌నా అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 :  భూభార‌తి చ‌ట్టం ద్వారా రాష్ట్రంలోని భూ స‌మ‌స్య‌లన్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్ర‌క‌టించారు.భూభారతి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు, భూములున్న ఆసాముల కోసం…

మంత్రుల హెలికాప్టర్ మిస్ ల్యాండ్..

భయంతో పరుగులు తీసిన జనం నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా‌ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్‌లో హాజరవుతున్నట్లుగా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కాస్త దూరంలో…

నన్ను టార్గెట్ చేస్తున్నారా?

2 వేల మంది షేర్ చేశారు.. చర్యలు అందరిపై ఉంటాయా? పోలీసుల నోటిసులపై స్పందించిన స్మితా సబర్వాల్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌19 : రాష్ట్రంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ…

హరీష్‌రావు కంట కన్నీరు..

ఓ చిన్నారి కథ విని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ‌రాజకీయాలలో ఆయన ఓటమెరగని నాయకుడు. ఆరడుగుల బుల్లెట్‌. అభివృద్ధి రాక్షసుడు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తు వేయడంలో దిట్ట. ఆయన ఎత్తులు వేస్తే ప్రత్యర్థులు చిత్తే. మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీల నేతలను చెడుగుడు ఆడుకుంటాడు. సబ్జెక్ట్ ఏదైనా,…

మరోసారి హైడ్రా కూల్చివేతలు షురూ..

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.  తాజాగా ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ‌కు చెందిన ఫామ్‌ ‌హౌస్‌ ‌ను హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. కొండాపూర్‌ ‌లోని సర్వే నంబర్‌ 79‌లో ఈ ఫామ్‌ ‌హౌస్‌ ‌ఉంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి…

ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు..

వడ్ల కొనుగోళ్ళకు సర్వం సిద్ధం చేశాం.. రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాలు 127.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 70.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 :  రాష్ట్రంలో యాసంగి సీజన్ లో రికార్డ్ స్థాయిలో…

జెఈఈ లో సత్తా చాటిన ఎస్సీ గురుకుల విద్యార్థులు

అడ్వాన్స్ కు అర్హత పొందిన 525 మంది గురుకుల చరిత్రలోనే కొత్త రికార్డు  హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 19: కార్పొరేట్‌ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు నిరూపించారు. జేఈఈ మెయిన్స్‌ 2025 లో గురుకులాలకు చెందిన 525 మంది విద్యార్థులు 61 పర్సెంటైల్‌…

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

ఉరుములు, మెరుపులతో పడే అవకాశం భారత వాతావరణ విభాగం హెచ్చరికలు ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 19 :‌తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్‌ ‌మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకోనున్నట్లు  తెలిపింది.…