Category ప్రత్యేక వ్యాసాలు

న్యాయవ్యవస్థ, చివరి రక్షణా గోడ అందామా?

M.S. Acharya's Editorial for Warangal Vani

“పోలీసు అధికారానికి చట్టం ఇచ్చిన బలం ఉంది; కానీ అదే చట్టం దానికి పరిమితులు కూడా విధించింది. అరెస్టు అంటే శిక్ష కాదు. విచారణ అంటే హింస కాదు. అనుమానం అంటే నేర నిర్ధారణ కాదు. FIR అంటే దోషిగా తీర్పు కాదు. కస్టడీ అంటే పోలీసుకు వ్యక్తిపై సంపూర్ణ అధికారం కాదు. పోలీసు ప్రజలను భయపెట్టే సంస్థ నుంచి ప్రజల హక్కులను…

భూపెన్ హజారికా స్మారక ప్రదేశ సందర్శన

“మూడు అంతస్తుల మ్యూజియంలో డా. భూపెన్ హజారికాకుసంబంధించిన జ్ఞాపకాలు, అరుదైన ఫోటోలు, పెయింటింగ్స్, ఆయన ఉప యోగించిన దుస్తు లు, వస్తువులు భద్రపరిచారు. ఇది ఆయన సృజనాత్మ కతను దర్శించడానికి కిటికీ లాంటిది అనిపించింది. పలు సినీ అవార్డులే కాకుండా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ప్రద్మ శ్రీ నుంచి భారతరత్న అవార్డులను అందుకున్న ఆ మహా గాయకుని గానమాధుర్యాన్నితలచుకుంటూ అంగుళం అంగుళం తినకిస్తూ మైమరచిపోయినసమయంలో .. “ గిరియానం .. 28 గౌహతిలో ఉదయం తొమ్మిది గంటలకు ఉపాహారం ముగించి కామాఖ్యదేవి ఆలయానికి చేరుకున్నాం. ఇది చాలా పురాతనమైన ఆలయం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. క్రితం సారి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి చూసాను కనుక ఈసారి ఆలయం బయటి నుంచే ఫోటోలు తీసుకొని వెనుదిరిగాను. ఇంతకు ముందు…

ఉద్యమాలకు ఊపిరి పాట… పోరాట చైతన్యానికి స్ఫూర్తి పాట

“ఒక పుస్తకాన్ని చదవడానికి అక్షరజ్ఞానం అవసరం. ఒక రాజకీయ ప్రసంగాన్ని అర్థం చేసుకోవడానికి కొంత పరిచయం అవసరం. పాటకు అలాంటి ముందస్తు అర్హత ఏదీ లేదు. అది చెవిలో పడుతుంది. జ్ఞాపకంలో నిలుస్తుంది. సందర్భం వచ్చినప్పుడు మళ్లీ గొంతుకెక్కుతుంది. ఒకరి గొంతులో పుట్టిన పల్లవి ఊరంతా తిరుగుతుంది. ఒక బాణీ తరతరాలను దాటుతుంది. పదాలు మారినా,…

వెలుగు నుంచి చీకట్లోకి తెలంగాణ?

“వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అంటే రైతు రోజంతా మోటరు నడపడం కాదు. పంటకు అవసరమైన సమయంలో నీరు పెట్టుకునే వెసులుబాటు. కరెంటు వస్తుందేమోనని అర్ధరాత్రి పొలానికి పరుగెత్తాల్సిన అవసరం లేకపోవడం. కుటుంబాన్ని వదిలి మోటరు వద్ద కాపలా కాయకుండా ఉండటం. నీటి తడి ఎప్పుడు ఇవ్వాలో రైతే నిర్ణయించుకునే భరోసా. అందుకే నిరంతర…

కేసీఆర్ మౌనమే కాదు, పాట కూడా ప్రభుత్వాన్ని భయపెడుతుందా!?

Is It Not Just KCR’s Silence, but His Song Too, That Is Causing Concern for the Government

“తెలంగాణ ప్రజలు అమాయకులుగా కనిపించవచ్చు. కానీ ఈ నేల నిత్యచైతన్యానికి చిరునామా. ఇక్కడి గాలిలో పోరాటం, నీటిలో తెగువ, మట్టిలో త్యాగాల వారసత్వం ఉన్నాయి. అవసరమైతే గడ్డిపోచ కూడా గడ్డపారగా మారుతుందనే నమ్మకం ఈ సమాజానిది. పాలనపై అసంతృప్తి కలిగినప్పుడు దానిని పాటగా, మాటగా, నిరసనగా వ్యక్తం చేయడం తెలంగాణ ప్రజలకు కొత్తేమీ కాదు..” మేధావుల…

భారతీయుల సొమ్ము విదేశీ సెమికండక్టర్ కంపెనీలకు పంపకం?

ప్రభుత్వాలు చెబుతున్నట్టు ఎఫ్.డి.ఐ ల ద్వారా టెక్నాలజీ మనకు బదిలీ కాకపోగా మన డబ్బునే వేల కోట్లు పెట్టుబడి సబ్సిడీగా ఇవ్వటం వలన ప్రధానంగా విదేశీ కంపెనీలు లాభపడుతున్నాయి. కొంతమేర దేశీయ ప్రైవేటు పెట్టుబడిదారులు లబ్ది పొందుతున్నప్పటికీ దేశీయ ప్రైవేటు పెట్టుబడిలో తరచుగా రుణాల రూపంలో విదేశీ ఫైనాన్స్ కంపెనీల వాటా ఉంటోంది. ప్రధాన మంత్రి…

రాజ్యాంగ విలువల ఉల్లంఘన!

“అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే, వోటర్ల జాబితా రూపకల్పన వంటి అత్యంత కీలకమైన పది నెలల కాలంలో ఏకంగా పన్నెండు కోట్ల మంది భారతీయులు వోటర్ల జాబితాలో తమ స్థానాన్ని కోల్పోవడం. తగినంత నోటీసు లేకుండా, వివక్షపూరితంగా తమ పేర్లను తొలగించారని బాధితులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వోటర్ల జాబితా అనేది ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిది. దానిలోని పారదర్శకతనే…

సువర్ణసుందరి — వెండితెరపై విరిసిన స్వర్ణస్వప్నం

“ఒకప్పుడు మా నాన్న కథ చెప్పేటప్పుడు సినిమా సన్నివేశాల మధ్య ఆ పాటల గురించి కూడా చెప్పి ఉండవచ్చు. కానీ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు, నాకు మాత్రం పాట వినిపించిన ప్రతిసారీ మరో స్వరం కూడా వినిపించినట్టనిపించింది. మా ఇంటి వాకిట్లో కూర్చుని సినిమా కథ చెబుతున్న మా నాన్న స్వరం. అదే జ్ఞాపకం ఈ…

రబీకి ముందు రైతుపై పగబట్టిన విధానాలు!

“విదేశీ యుద్ధాలు, పశ్చిమాసియా పరిణామాలను చూపిస్తూ చేతులెత్తేయడం పాలకవర్గం స్పష్టమైన పాలనా వైఫల్యానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. రబీ సీజన్ ఉధృతంగా ప్రారంభమయ్యేలోగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, అంతర్జాతీయంగా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అన్వేషించాలి. ఎరువుల తయారీ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ధరలను అదుపులో ఉంచాలి. రైతులకు అవసరమైన అత్యవసర నిల్వలను తక్షణమే జిల్లాల వారీగా…