మృత్యువు -భీమవరపు పురుషోత్తమ్

కాలం నన్ను గాలిపటంలా ఎగరేసినపుడు ఆనందపు గిలిగింతలు చూశాను కరుకు పాదాలతో అణగదొక్కినప్పుడు గబ్బువాసనలో కృంగిపోయేను కాలం ఒక్కటే! కానీ, ఇలా ఎలా? బహురూపాల గురించి కనుక్కుందామని ఇంటికి వెళ్ళా ఇంటి ముందు అంతులేని జనం నాలాగే వచ్చి పడిగాపులు పడి ఉన్నారు ఇదయ్యేపనికాదని వచ్చేస్తూ కాలం ఇంటి ముందు బోర్డు చూసి ఉలిక్కిపడ్డా అక్కడ బంగారురంగు అక్షరాలు…







