ఏటి ఒడ్డున కట్టుకున్న ఇసుకదిబ్బల గూడు
కళ్ళలో దృశ్య రేణువు కలవరపెడుతుంది.
బాల్యం మీద సీతాకోక ఎగిరిపోయినట్లే,
ఇప్పుడు చేతులకు వేలాడుతున్న
పాదాల సమూహం నిర్మించుకున్న
శ్రమ శిల్ప ఇసుక గూడు లేదు
నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది.
అక్కడ ఏరు కూడా లేదు.
ఊరు తన రూపం మార్చుకొని
విశ్వసుందరి పోటీలో నిలబడింది.





