Category Shoba

రాత్రినుండి రాత్రిలోకి

-మణీందర్ గరికపాటి ఎన్ని జ్ఙాపకాలు తగలబడుతున్నాయో పొగచూరిన ఆకాశంలా చిమ్మచీకటి నిర్దయరాత్రి నిద్రనుండి వెలివేయబడిన దేహం కనుల కొలకులనుండి ఒలికిపోయిన జాములు ఒంటి పైకి అకస్మాత్తుగా బీరతీగలాగా పాకుతున్న ఎక్ల్సూసివ్ కలలు ఈ వెన్నెల గాలిలో ఆక్సిజన్ నిండుకుంది ఇప్పుడు నేను ఏ గ్రహాంతరంలో ఉన్నాను ఏ నీలి కుహరంలో మునిగిపోయాను పగటి వస్త్రాన్ని వదిలేసి…

కాలాతీత నవలా సంతకం

చెమ్మ : వారాల ఆనంద్ 1950ల కాలంలో డాక్టర్ పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ తెలుగునవలల్లో అత్యంత ముఖ్యమైనది. ఇది ఆధునిక తెలుగు నవలా వికాసంలో మైలురాయి. మధ్యతరగతి కుటుంబాల జీవితం, స్త్రీ-పురుష సంబంధాలు, వ్యక్తిత్వ సంఘర్షణలు, ప్రేమ, వివాహం, స్త్రీ స్వేచ్ఛ, ఆత్మగౌరవం వంటి అంశాల్ని రచయిత్రి బాగా చిత్రించింది. నవలలోని ప్రధానపాత్ర…

సంకటం!

మెరుపు తీగెలు “ఒరే అడ్డగాడిదా… నీ ఫ్రెండ్స్ వచ్చార్రా…” మా నాన్న పెద్దగా కేకవేశాడు. అప్పటికే ‘హీ-హా  హీ-హా’ అంటూ పెద్ద శబ్దాలు. ఒకటి కాదు, వందల గొంతుకలు. నేను లోపలి గదిలోంచి వస్తూ “యేమిటా శబ్దం” అన్నాను, భరించలేనట్టు చెవులు మూసుకుంటూ. “నిన్ను పిలుస్తున్నాయి” అన్నాడు మా నాన్న, ‘వెళ్ళూ’ అన్నట్టు తలాడిస్తూ. గుమ్మంలోకి…

స్వప్నాల వేటలో..

మోసుకొచ్చిన స్వప్నాలను నిజం చేయలేని నిరాశలో పరాయి దేశాన పడుతున్న అగచాట్లను చెప్పుకోలేని అశక్తతలో హీలియం బుడగల్లా యువశక్తి నిస్సారమై గాలివాటుకు గమ్యం తెలియక నిట్టూరుస్తున్న దైన్యం మనసులో మౌన తుఫాన్లను దాచుకుని వలస యువహృదయాలు అగమ్యపు భవిష్యత్ గమ్యాల ఎదుట ఆందోళనల అలల నడుమ సతమతమవుతున్నాయి గొప్ప ప్రజాస్వామ్య దేశమని ప్రపంచస్థాయి విద్య ఊహకు…

మూడు పాదాల కవిత్వం

ఎంత తోడినా తరగని‌ నీళ్లు – అమ్మ‌ ఓ కన్నీటి బావి * ఎప్పుడూ వానే‌ అమ్మానాన్నల కళ్లల్లో పిల్లల్ని తడవనిచ్చేవాళ్లు‌కాదు * తుపాకీ శబ్దం చిలుకలు వాలిన చెట్టు తిరిగి మోడైంది * తెరిచి చూడాలేగానీ అనంతమైన ఆకాశం హైకూ కిటికి * మూడు ముక్కలేనా నాలుగు దిక్కులు హైకూ -చిత్తలూరి

అస్తిత్వం రాసుకున్న చివరి వాదన

ఎంతకాలం బ్రతుకుతానో కాదు, ఇంకెవరిని కోల్పోవలసి ఉందో అదే కాలాన్ని కొలుస్తుంది. చెట్టు వేర్లు భూమిని పట్టుకుని ఉండవు పడిపోవాల్సిన కారణాలను తర్కంతో వాయిదా వేస్తుంటాయి. ఒంటరితనం మనుషులు లేని స్థితి కాదు, మన జ్ఞాపకాల కంటే మనమే ఎక్కువకాలం మిగిలిపోవడం. వయసు శరీరపు క్షీణత కాదు, ఇతరుల ఆందోళనలో మన ఉనికి బరువుగా మారడం.…

పాలపిట్ట సొత్తు

నారింజ పండు బొటనవేలు ఎగరేసిన పావళ బిళ్ళ వాడు మోడిపండు చేతిలో పుర్రెలేని తోలు బొమ్మ పూటకో ఏషం ఏషానికో డైలాగ్ మార్చెటోడు సద్ది తిన్న రేవును నీడనిచ్చిన జెమ్మిచెట్టును తలుసుకొని బతుకాలి ఆత్మగల్ల చెట్టును ఆగం జెయ్యాలని జూత్తె అగ్గి కురిపించె అతారలను ఎత్తుకుంటది బంగారు పూలతో పునాదిగ పేర్చుకున్న మట్టిపూల బతుకమ్మను అవమానిస్తే…

అనుభవాలతో తడిసిన వాక్యాలు

చెమ్మ : వారాల ఆనంద్ ‘ఒక చిరునవ్వు ముందు, ఒక దయామయమైన చూపుముందు, ఒక అద్భుతమైన, ఆత్మీయ కరచాలనం ముందు ఏ పురస్కారాలు ప్రశంసలు సరిపోవు’ అని రావూరి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు సాహిత్యంలో సాటి మనుషుల జీవితాల్ని ఎంతో దగ్గరగా చూసి అనుభవించి రాసిన రచయితల్లో రావూరి భరద్వాజ ముఖ్యులు. ఆయన…

విఫల

ఏది తన అడుగు భూమో ఏది తన నీడ నేలనో ఏది సేద తీరే సరోవరమో ఏది మోసల్ల మడుగో అంతు పట్టని వింత పరిస్థితి చూపులు  వృధా కను పాపలు వృధా రెప్పల కాపల  కష్టం వృధా వృధా ఎక్కడో ఒలికి పోయిన దృశ్యాలను హెలెన్ కెల్లర్ లా   పట్టుకున్నట్టు చూడాల్సినవి ఐపోయాకా…