పాలపిట్ట సొత్తు

నారింజ పండు బొటనవేలు ఎగరేసిన పావళ బిళ్ళ వాడు మోడిపండు చేతిలో పుర్రెలేని తోలు బొమ్మ పూటకో ఏషం ఏషానికో డైలాగ్ మార్చెటోడు సద్ది తిన్న రేవును నీడనిచ్చిన జెమ్మిచెట్టును తలుసుకొని బతుకాలి ఆత్మగల్ల చెట్టును ఆగం జెయ్యాలని జూత్తె అగ్గి కురిపించె అతారలను ఎత్తుకుంటది బంగారు పూలతో పునాదిగ పేర్చుకున్న మట్టిపూల బతుకమ్మను అవమానిస్తే…







