ఏ ముడి ఎక్కడ చిక్కుబడునో

ఏ ముడి ఎక్కడ విడుబడునో

రాగల కాలం నిర్ణయించేనా

ఏ మేఘం ఎక్కడ వర్షించేనో

ఏ మేఘం ఇంకెక్కడ ఘర్జించునో

రాగల ఋతువు నిర్ణయించునా

ఏ పూవు ఏ దైవ పూజకో లేదా

మరే ఊరేగింపుకో

ఏ స్నేహం ఏ తీరానికో

ఏ ప్రేమ ఏ బలిదానానికో

రాగల అక్కున చేరగల

వసంతాలు తేల్చేనా

ఓ రాగల కాలమా

ఈ రాతి హృదయాలను కరిగించి

రంగు రంగు బొమ్మలుగా తీర్చిదిద్ది

గతాన్ని మరిపిస్తావో

లేదా

ఆ గతానికే అంకితమిస్తావో

నీదే ఆజ్ఞ

నీదే ఆ దైవాజ్ఞ

-ఎం.డి అమర్ పాషా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *