ఆబిడ్స్‌లో మహిళపై దూసుకెళ్లిన కారు

– గాయాల‌తో హాస్పిట‌ల్‌లో చికిత్స‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌నగరంలోని అబిడ్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ లో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సునీత విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో సినిమా నిర్మాత డ్రైవర్‌ ‌మహానంద నడుపుతున్న కారు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకెళ్లినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో సునీత కాలుకు ఫ్రాక్చర్‌ అయింది. వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన అనంతరం కారు య‌జ‌మానికి ఫోన్‌ ‌చేసి సునీత చికిత్సకు ఖర్చులను భరించాలని కోరినట్లు చెప్పారు. అయితే డబ్బులు ఇవ్వనని దురుసుగా సమాధానం ఇచ్చినట్లు వారు వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు అబిడ్స్ ‌పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *