ఉగాది నుంచి భూభారతి అమలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా మంత్రి వర్గ భేటీ
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం
తెలంగాణ కేబినెట్‌సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లును ఆమోదించినట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రెవెన్యూ శాఖ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి
అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాల గురించి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రాన్ని ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్ సిటీ ఉంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. 11 జిల్లాలు, 104 మండలాలు సుమారు 1355 గ్రామాలు, 332 రెవెన్యూ గ్రామాలతో హెచ్ఎండీఏను విస్తరించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.





