అంతర్జాతీయ మహి ళా దినోత్సవం వాస్త వంగా శ్రామిక పో రాట దినోత్సవం. మహిళల పోరా టా నికి ప్రతీక. పారి శ్రా మిక విప్లవం తర్వాత పరిశ్రమలలో పని చేసే మహిళలు పని గంటల తగ్గింపు కోసం, సమాన వేతనం కోసం, మెరుగైన వైద్య సదుపాయాల కోసం సమన్యాయం, సమానత్వపు హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకున్న తర్వాత .ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి, స్మరించు కోవడా నికి అంతర్జాతీయంగా ఒకరోజు కావాలని చేసిన ప్రయత్నమే మహిళా దినోత్సవం. మొదటగా వేరువేరు రోజులలో,వేరువేరు దేశాలలో జరుపుకునేవారు. అంతర్జాతీయ మహిళా దినో త్సవం శ్రామిక పోరాట స్ఫూర్తిని స్మరిం చుకుంటూ, పోరాడిన వారి త్యాగాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తు తరాల మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచనలు, సమాలో చనలు, చర్చలు జరిగేవి. కాల గమనంలో ప్రపంచీకరణ నేపథ్యంలో గత పోరాట స్ఫూర్తిని మరచి, ఆట పాటల వేదికగా, డిస్కో క్యాబరీ డాన్సుల కేంద్రంగా, డీజే మోతలతో స్టెప్పులు వేస్తూ, విందు వినోదాల కేంద్రంగా, అందాల పోటీలు, రాంప్ వాకింగ్ ఈవెంట్ల బహుమతుల ప్రధానోత్సవంలతో రంగుల ప్రపంచంలో వినిమయ సంస్కృతితో డెలిగేట్ ఫీజులతో మహిళా దినోత్సవ ముఖ్య ఉద్దేశ0 తెలియని ముఖ్య అతిథులతో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ మెంట్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం బాధాకరం మరియు విచారకరం. మహిళల హక్కుల కోసం, సమానత్వం కోసం పోరాడిన మహిళల త్యాగాలను మరచి, వారి చరిత్రను పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించకుండా అసలు ఉద్దేశాన్ని దారి మళ్లించి ఉల్లాసం ఉత్సాహం పేరిట ఒక బడలిక తీరే రోజుగా నిర్వహించుకోవడం సరైనది కాదు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యం..
పారిశ్రామిక విప్లవం తర్వాత పరిశ్రమలలో రోజుకు 14 గంటల నుండి 18 గంటలు వెట్టిచాకిరీ చేస్తుండటం మూలంగా స్త్రీల శ్రమ దోపిడీ నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ అమానవీయమైనా అణిచివేతను, వివక్షత ను నిరసిస్తూ మహిళా కార్మికులు తమ రక్తాన్ని చిందించి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మౌలిక వసతుల కల్పన కోసం’’ మాకు రొట్టె కావాలి- రోజా పూలు కూడా కావాలి’’ అని నినదిస్తూ మహిళా కార్మికులు మహత్తర పోరాటాలు చేశారు. 1908లో పనిగంటల కుదింపు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళను డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళా కార్మికులు చేసిన అసాధారణ పోరాటాలకు సంకేతంగానే అంతర్జాతీయంగా ప్రతియేటా పోరాట స్ఫూర్తితో మహిళా దినోత్సవాన్ని జరపాలని క్లారా జెట్కిన్ 1910 లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో ప్రతిపాదించగా 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన వందమంది మహిళలు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా , డెన్మార్క్, జర్మనీ స్విట్జర్లాండ్ దేశాలలో నిర్వహించడం జరిగింది. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. ఐక్యరాజ్యసమితి అధికారికంగా 1975 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం ప్రార ంభించింది.
ఆ పోరాట స్ఫూర్తితో మహిళల హక్కుల సాధన కోసం ఎన్నో ఉద్యమాలు నడిచాయి. మన దేశంలో కూడా ఆ ఉద్యమాలను ప్రేరణగా తీసుకుని భూమి కోసం, భుక్తి కోసం,విముక్తి కోసం సాగుతున్న పోరాటాలలో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, ఆదివాసి వీరవనితలు సమ్మక్క సారక్కలు, చాకలి ఐలమ్మ లాంటి మహిళలు ముందు వరుసలో నిలబడి పోరాటం చేశారు. అం• •ర్జాతీయ మహిళా దినోత్సవానికి 114 సంవత్స రాల చరిత్ర ఉన్నప్పటికీ ఇప్ప• •వరకు ఆ రోజు యొక్క ఉద్దేశ్యం నెరవేరలేదు. మహిళలకు హక్కులు, సాధికారిత , అణిచివేత లేని సమాజం కోసం, శ్రామిక మహిళల అభ్యున్నతి కోసం, లైంగిక దాడులు అత్యాచారాలు అవ మానాలు లేని రోజు కోసం ఇంకనూ ఎదురు చూస్తున్న ఎండమావిగానే మిగిలిపోయింది. ఆర్థిక ,రాజకీయ, సాంఘిక, సామాజిక రంగాలలో స్త్రీల అభివృద్ధి అంతగా జరగలేదు. స్త్రీల అభివృద్ధి గురించి ఇంటాబయటా వేదనకు గురవుతున్న అట్టడుగు వర్గాల స్త్రీల జీవితాల గురించి చర్చ జరగాల్సిన రోజుగా, శ్రామిక పోరాట స్ఫూర్తి గా అంతర్జాతీయ శ్రామిక పోరాట దినోత్సవం గా జరుపుకోవాల్సిన పరిస్థితులకు భిన్నంగా డిస్కో డాన్స్ లు, ఫ్యాన్సీ షోలు, ఆటపాటలు లాంటి కాలక్షేపపు కార్య క్రమాలతో నిర్వహిస్తుండడం బాధాకరం. అభివృద్ధి పేరిట జీవితాలను ధ్వంసం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడుటకు స్త్రీలను చైతన్యవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
పితృస్వామ్య పురుష దురహంకార సమాజంలో మహిళలకు దక్కాల్సిన గౌరవం లభించడం లేదు. మహిళల పట్ల చిన్న చూపు హింసించడం , దూషించడం, అవమానపరచడం, అణగ దొక్కడం పరిపాటి అయింది. దేశానికి స్వాత ంత్రం 76 సంవత్సరాలు పూర్తయినను మహిళల పట్ల వివక్షత విడనాడలేదు. పసి పాప నుండి పండు ముసలి వరకు హత్యలు అత్యా చారాల నేరాల ఘోరాలను ఎదుర్కొంటూనే ఉంటున్నారు. మహిళలపై హింసాత్మక సంఘటనలు జరగని రోజు లేదు. వరకట్న దురాచారం, ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, పరువు హత్యలు నిత్య కృత్యమయ్యాయి.
గత సంవత్సరం ఆగస్టు 9న దేశాన్ని అట్టుడికించిన కోల్కత్తా ఆర్ జి కార్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దారుణాతి దారుణం. మహిళా ముఖ్యమంత్రి ఏలుతున్నటువంటి బెంగాల్ రాష్ట్రంలో ఆస్పత్రిలో సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నా డాక్టర్ పై అత్యాచారం జరిగిందంటే మహిళల భద్రత పట్ల పాలకవర్గాలకు ఉన్న శ్రద్ధ అవగాహన చేసుకోవచ్చు. మహిళలపై దాడులు ఒక విధంగా పాలకవర్గాల దాడులు గానే పరిగణించవచ్చు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కలదు. అది కల్పించాల్సిన బాధ్యతా పాలకవర్గాలదే. కానీ కంచే చేను మేసిన చందంగా శాసనకర్తలే నిందితులుగా మరియు నిందితులను తమ అధికార అర్ధ అంగ బలములతో కాపాడటం, క్షమాభిక్షను ప్రసాదించడం అత్యంత విషాదకరం. బిల్ కీస్ భాను కేసులో శిక్ష పడినటువంటి నిందితులకు పాలకవర్గాలు క్షమాభిక్ష ప్రసాదించడం మహిళలపై అత్యాచార ఘటనలకు పరోక్షంగా మద్దతు ఇవ్వడమే అవుతుంది. రాజ్యాంగం ప్రసాదించిన మహిళల హక్కులను కాపాడడంలో భద్రత కల్పించడంలో పాలకవర్గాలు విఫలం అయ్యాయి.
మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా ఇండియా నమోదు కావడం ఆశ్చర్యకరం. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, భేటీ పడావో బేటి బచావో అని అందమైన నినాదాలు ఇస్తూ, అందుకు విరుద్ధంగా భద్రతా చర్యలు ఉండటం విడ్డూరం.. కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో అనేకసార్లు మహిళా సాధికారిత గురించి నొక్కి వక్కానించినప్పటికీ మహిళల శక్తి ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తిస్తుందని పెట్టుకున్నప్పటికీ మహిళల సంక్షేమానికి ముఖ్యమైన కేటాయింపులు పెద్దగా ఏమీ లేవు. స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించడానికి మహిళా సాధికారిత తో పాటు రాజకీయ చైతన్య0, చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం అత్యంత ఆవశ్యకము. మహిళా బిల్లు లోని అంశాలు అమలయ్యేలా, పితృస్వామ్య పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగబద్ధహక్కులను కాపాడుకోవడానికి మహిళలు సంఘటితమై, సంగటిత పోరాటాలు నిర్మించాలి. మార్చి 8 పోరాట స్ఫూర్తికి ప్రతిబింబంగా ఆదివాసీ దళిత మైనారిటీ పోరాటాలను ఉద్యమ స్ఫూర్తి ఎత్తిపట్టేలా అంతర్జాతీయ మహిళా దినోత్స వంను అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా ఘనంగా నిర్వహించాలి.
తండ సదానందం
ప్రధాన కార్యదర్శి భగత్ సింగ్ స్టడీ సర్కిల్
మహబూబాబాద్