పట్టపగలే నడి రోడ్డుపై దారుణ హత్య

నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెం బర్ 17 : నిజామా బాద్ జిల్లా కేంద్రంలో నడి రోడ్డుపై గురువారం సాయం త్రం దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక ఆర్ఆర్ చౌరస్తాలో హరిబాబు అనే వ్యక్తిని దుండగుడు కత్తితో విచక్ష ణారహితంగా దాడి చేసి హతమార్చారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన లైవ్ మర్డర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రద్దీగా ఉండే ఆర్ఆర్ చౌరస్తాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన దుండ గుడు హరిబాబును లక్ష్యంగా చేసుకుని కత్తులతో విచక్షణారహితంగా నరికాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన హరిబాబు రక్తపు మడుగులో పడి అక్క డికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. నడిరోడ్డుపై ఈ హత్యతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే.. హత్యకు గురైన హరిబాబును యూట్యూబర్ వైష్ణవి భర్తగా పోలీసులు గుర్తించారు. గతంలో గర్భిణీ అయిన వైష్ణవిని హరిబాబు హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ కేసులో అరెస్టయిన హరిబాబు ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇంతలోనే ఈ హత్య జరగడం గమనార్హం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *