– నవంబర్ 29న ఎస్ఐ, డిసెంబర్ 20న కానిస్టేబుల్ రాత పరీక్ష
– రాష్ట్రవ్యాప్తంగా 5,77,064 మంది దరఖాస్తు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,4 37 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి జారీ చేసిన నోటిఫి కేషన్కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను టీఎస్ఎల్పీఆర్బై తాజాగా విడుదల చేసింది. పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. నవంబర్ 29న ఎస్ఐ రాత పరీక్ష, డిసెంబర్ 20న కానిస్టేబుల్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు టీఎస్ఎల్పీఆర్ బీ చైర్మన్ వి.వి. శ్రీని వాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. పోలీసు ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,77,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
పోస్టుల వారీగా దరఖాస్తుల వివరాలు:
మొత్తం ఉద్యోగాలు: : 7,437
మొత్తం దరఖాస్తుదారులు: 5,77,064
ఎస్ఐ పోస్టులకు దరఖాస్తులు: 1,60,756
కానిస్టేబుల్ పోస్టులకు 3,89,356
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాలు, సమయం వంటి పూర్తి వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేసే సూచనల మేరకు పరిశీ లించుకోవాలని బోర్డు సూచించింది. అభ్యర్థు చివరి నిమిషం వరకు ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





