ఓడిపోయి, మద్దెల ఓడు అంటారా?

ఇటాలియన్‌ కమ్యూనిస్టు నాయకుడు గ్రాంసీ ప్రకారం, రాజ్యసంస్థలు తమ వివిధ విభాగాల ద్వారా సాంస్కృతిక, భావజాల ఆధిపత్యాలను అమలు చేస్తాయి. ప్రజల ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అట్లాగే, పౌరసమాజం కూడా ఆధిపత్యాల స్థాపనకు సాధనమే. రాజ్యంలో భాగం కాని సంస్థలు, వ్యక్తులు పౌరసమాజం వేదికగానే, ప్రయోజనాల ఘర్షణలో పాల్గొంటాయి. ప్రజల ఆలోచనలను భిన్నంగా రూపొందించే ప్రయత్నం చేస్తాయి. ప్రత్యామ్నాయాలకు సహాయపడతాయి. గ్రాంసీ చెప్పిన అర్థంలోనే ఖచ్చితంగా ఇవాళ మనం ‘పౌరసమాజం’ అన్న మాటను ఉపయోగించడం లేదు, కానీ, ఆయన నిర్వచనం ఒక కనీస ప్రాతిపదికను ఇస్తుంది.

రాజకీయాలలో ప్రత్యక్ష ప్రమేయం పెట్టుకో కుండా, క్షేత్రస్థాయి ప్రజాజీవన రంగాలలో పనిచేస్తున్న సంస్థలు, వాటితో పాటు పనిచేస్తున్న పరిశోధకులు, మేధావులు,ప్రజా ఉద్యమాలకు సానుకూల స్థితి గతులను కల్పించే హక్కుల ఉద్యమ సంస్థలు, వాటి కార్యకర్తలు, ప్రజానుకూల విధానాల అమలు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే, ప్రభుత్వ సంక్షేమాలను ప్రజలకు సజావుగా అందించేందుకు ప్రయత్నించే స్వచ్ఛంద సంస్థలు, విశ్లేషకులు, వ్యాఖ్యా తలు, అనేక కారణాల రీత్యా సమాజంలో గౌరవాన్ని, ఆలకింపును కలిగి ఉన్న ఆలోచనాపరులు, వీరందరినీ మనం పౌరసమాజంగానే పరిగణిస్తున్నాం. ఇదంతా ఏకశిలా సదృశంగా ఉండదు. విడివిడి, కలివిడి బృందాలు గానూ, సమన్వయమే లేని సమూహా లుగానూ ఉండ వచ్చు. ఏ సమాజంలో అయినా ఒక పెద్దమనుషుల శ్రేణి, అధికార వ్యవస్థలతో సరిసాటి నైతిక స్థాయిని, ప్రత్యేకమైన పలుకుబడిని కలిగి ఉండే అవకాశం ఉంది, కానీ, ప్రజాస్వామ్యంలో దానికి మరింత ఎక్కువ అవకాశముంది, శక్తి కూడా ఉంది. మొత్తం సమా జానికి విలువల కొలబద్దగా పౌరసమాజం నిలబడ గలదు కూడా.

బొటాబొటి అధికారంతో నెట్టుకువచ్చే పాలకులు సాధారణంగా పౌరసమాజంతో తగవు పెట్టుకోరు. పౌరసమాజం నామమాత్రంగానో, తక్కువ పలుకు బడితోనో ఉన్నా కూడా దాని జోలికి పోరు. కానీ, తమ అధికారాన్ని సవాల్‌ చేసే శక్తులకు పౌరసమాజ ఆచరణ తోడ్పడుతుంటేనో, లేదా, తాము నెలకొల్ప దలచుకున్న విలువల వ్యవస్థకు చెలామణీ రాకుండా పౌరసమాజ ప్రతిష్ట అడ్డుపడుతుంటేనో, బలమైన స్థితిలో ఉన్న రాజ్యం లేదా ప్రభుత్వాలు స్వయంగా రంగంలోకి దిగుతాయి. స్వతంత్రమైన గొంతుకలకు విశ్వసనీయత లేకుండా ప్రచార యుద్ధం మొదలు పెడతాయి. ఎమర్జెన్సీకి ముందు కాలంలో ‘లోక్‌ నాయక్‌’ జయప్రకాశ్‌ నారాయణ్‌ ను సిఐఎ ఏజెంట్‌ అని ఇందిరాగాంధీ ప్రచారం చేసిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి.

‌పౌరసమాజ ప్రతినిధులు అనేకులు రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొందరు ప్రముఖులు అంత తరచుగా కానీ, తీవ్రంగా కానీ, మొత్తంగా కానీ చేయకపోవచ్చు. కెటిఆర్‌, ‌హరీశ్‌ ‌రావులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కానీ, కెసిఆర్‌ అట్లా చేయడం లేదు కదా? కొంత సమయం ఇచ్చి చూడాలని కెసిఆర్‌ అనుకున్నట్టే కొందరు పెద్దమనుషులు కూడా అనుకుని ఉండవచ్చు.

ఇప్పుడు పదకొండేళ్ళ బిజెపి పాలనా కాలంలో, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా స్వామిక, ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన వారందరి విశ్వసనీయత మీద అసభ్యకరమైన, తీవ్రమైన దాడులు చూస్తున్నాం. వేర్వేరు ఆలోచ నావిధానాలకు చెంది, వేర్వేరు రంగాలలో పనిచేస్తున్న మేధావులను, క్రియాశీలురను ఒకే కుట్రకేసులో బంధించి వేధిస్తుండడం చూశాం. దాదాపు ఏడు దశాబ్దాలలో స్వతంత్ర భారతదేశంలో రూపొందిన ప్రజా స్వామిక పౌరసమాజాన్ని అంతటినీ విశ్వసిం చకూడని, గౌరవించదగని, దేశవిధేయత లేని సమూ హంగా చిత్రించి, దానికి ఆధిపత్యాలను ప్రతిఘటించే, నిరోధించే శక్తిని క్షీణింపజేసే ప్రయత్నం వేగంగా జరుగుతోంది. మెజారిటేరియన్‌ సమ్మతితో కూడిన తీవ్రనియంతృత్వాన్ని అమలుచేయడానికి పౌరస మాజాన్ని డీలెజిటిమైజ్‌ చేయడం పాలకులకు అవసరమవుతున్నది.

ఒక్క బిజెపి వంటి పార్టీలలోనే కాదు, ఈ లక్షణం అన్ని ఆధిపత్యవాద పార్టీలలోనూ అంతో ఇంతో ఉన్నది. కొత్తగా అధికారం కోల్పోయిన పార్టీలలోనూ కనిపి స్తున్నది. ఈ మధ్య కాలంలో, అది పిలకలు మొలకలు వేస్తున్నది. పదహారునెలల కిందట జరిగిన ఎన్నికలలో పరా జయం పొందిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)కి, తెలంగాణ పౌరసమాజంతో ఇంకా సమస్యాత్మక సంబంధమే కొనసాగుతోంది. నిజానికి ప్రతిపక్షంగా మారిన పార్టీకి పౌరసమాజానికి సహజమైన సఖ్యత ఏర్పడాలి. కానీ, అట్లా జరగలేదు. బిఆర్‌ఎస్‌ అధి కారపక్షంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఆ సంబంధమే కొనసాగుతోంది. అధికారం నుంచి దిగిపోయినా తామే అధికారపక్షం అన్నట్టు పౌరసమాజం వ్యవహ రిస్తోందని బిఆర్‌ఎస్‌, ప్రజాజీవితం మీద బీఆరెస్‌ పదేళ్ల పాలన ప్రభావ భారం ఇంకా వదలలేదని పౌరసమాజం అంటున్నాయి. పౌర సమాజ ప్రతినిధులు పక్షపాతం తో ఉన్నారని, ద్వంద్వ విలువలు పాటిస్తున్నారని, రేవంత్‌ రెడ్డి ప్రాపకం కోసం చూస్తున్నారని సోషల్‌ మీడియా లో విమర్శలు గుప్పిస్తూ, వారి విశ్వసనీయత మీద బీఆర్‌ఎస్‌ శిబిరం దాడి చేస్తున్నది. ఒక రాజకీయపార్టీ ప్రతిష్ఠ నిత్యం ఘర్షణలో ఉండడం సహజమూ, అవసరమూ కూడా. కానీ, పౌరసమాజాన్ని బదనామ్‌ చేయడం లేదా పౌరసమాజం బదనామ్‌ కావడం మొత్తం సమాజానికి చేటు చేస్తుంది. అది ఒక తటస్థ రంగం. ఆ వేదికను కూలగొడితే నమ్మకమైన వ్యవస్థలే ఉండవు.

దాదాపు ఏడు దశాబ్దాలలో స్వతంత్ర భారతదేశంలో రూపొందిన ప్రజాస్వామిక పౌరసమాజాన్ని అంతటినీ విశ్వసించకూడని, గౌరవించదగని, దేశవిధేయత లేని సమూహంగా చిత్రించి, దానికి ఆధిపత్యాలను ప్రతిఘటించే, నిరోధించే శక్తిని క్షీణింపజేసే ప్రయత్నం వేగంగా జరుగుతోంది. మెజారిటేరియన్‌ సమ్మతితో కూడిన తీవ్రనియంతృత్వాన్ని అమలుచేయడానికి పౌరసమాజాన్ని డీలెజిటిమైజ్‌ చేయడం పాలకులకు అవసరమవుతున్నది.

తెలంగాణ ఉద్యమంలో పౌరసమాజం పాత్ర విశేషమైనది. అది తెలంగాణలో కొన్ని దశాబ్దాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చినది. తన రాజకీయ స్వయం పాలన కోసం ఉద్యమించే ముందే, తెలంగాణ ప్రాంతీయ అసమానతల మీద, భూస్వామ్య దుర్మార్గాల మీద, రాజ్య హింస మీద, వనరుల అన్యాక్రాంతం, విధ్వంసం మీద, వ్యవసాయంతో సహా గ్రామీణ జీవనరంగాల సంక్షోభం మీద వివిధ వేదికల నుంచి, వివిధ మార్గాల ద్వారా పోరాడుతూ ఉన్నది. ఆ పోరాటాల నుంచి తెలంగాణ పౌరసమాజం రూపుదిద్దుకుంది. కాళోజీ, జయశంకర్‌, హరగోపాల్‌, బి. జనార్దనరావు, కోదండరామ్‌ మొదలైన అనేకులు, విద్యా, సామాజిక, న్యాయ, పాత్రికేయ రంగాల వారు, తెలంగాణ తరఫున ఆలోచనాపరులుగా, సొంతగొం తులుగా నిలిచినవారు. మలిదశ తెలంగాణ పోరా టానికి తొలిఅడుగులు కూడా కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాకార్యకర్తలతో కూడిన పౌరసమాజం నుంచే పడ్డాయి. రాజకీయపార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి 2001 లో ఏర్పడినా, ఆ పార్టీకి, దాని సారథి కెసిఆర్‌ కు మించిన శక్తిగా తెలంగాణ పౌరసమాజం ఉండిరది. అదే ఉద్యమ సమాజంగా మారింది. ఉద్యమానికి అవసరమైన నైతికతను, విశ్వసనీయతను, ఆలోచనను ఇవ్వగలిగిన జయశంకర్‌ను, కెసిఆర్‌ తనకు పెద్దదిక్కుగా, మార్గదర్శిగా చూపడం, తెలంగాణ పోరాటక్రమంలో పౌరసమాజం పాత్రను చెబుతుంది.

ప్రాంతీయ అస్తిత్వ పోరాటానికి ప్రాంతీయ పార్టీ అవసరమైంది. దురదృష్టవశాత్తూ, ప్రాంతీయపార్టీలు మనదేశంలో వ్యక్తి కేంద్రిత పార్టీలుగా, కుటుంబ పార్టీలుగా పరిణమించడం ఆనవాయతీ అయిపో యింది. పోనీ, ఏకవ్యక్తి పార్టీలుగా, వారసత్వ పార్టీ లుగా మారినా, పార్టీ వెనుక ఉన్న సిద్ధాంతాలను నిలుపుకుంటే కొంతలో కొంత నయం. మత రాజకీయాలు కూడా కలసి ఉన్న అకాలీదళ్‌ కూడా కుటుంబపార్టీగా మారినా, తన మౌలిక సిద్ధాంతాలను ఏదో రీతిగా కొనసాగిస్తోంది. డిఎంకె వారసత్వ పార్టీ అయినా, ద్రావిడ వాదాన్ని బలహీన రూపంలోనైనా నిలుపుకుంది. కానీ, తెలుగుదేశం పార్టీ, ప్రాంతీయ పార్టీల అవలక్షణాలన్నిటిని సంక్రమింపజేసుకుంది, కానీ, స్థాపన నాడు ఎన్టీయార్‌ చెప్పిన ఆదర్శాలేవీ ఇప్పుడు ఆ పార్టీకి గుర్తులేవు. ఫెడరలిజం కోసం పుట్టినట్టు చెప్పుకున్న పార్టీ, సమాఖ్య ఆదర్శాన్ని ధ్వంసం చేసి కేంద్రీకృత అధికారాన్ని నెలకొల్పా లనుకుంటున్న కూటమిలో భాగస్వామిగా మారి పోయింది.

మలిదశ తెలంగాణ పోరాటానికి తొలిఅడుగులు కూడా కవులు,కళాకారులు, మేధావులు, ప్రజాకార్యకర్తలతో కూడిన పౌరసమాజం నుంచే పడ్డాయి. రాజకీయపార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి 2001 లో ఏర్పడినా, ఆ పార్టీకి, దాని సారథి కెసిఆర్‌ కు మించిన శక్తిగా తెలంగాణ పౌరసమాజం ఉండిరది. అదే ఉద్యమసమాజంగా మారింది. ఉద్యమానికి అవసరమైన నైతికతను, విశ్వసనీయతను, ఆలోచనను ఇవ్వగలిగిన జయశంకర్‌ను, కెసిఆర్‌ తనకు పెద్దదిక్కుగా, మార్గదర్శిగా చూపడం, తెలంగాణ పోరాటక్రమంలో పౌరసమాజం పాత్రను చెబుతుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి కొంతకాలమైనా సిద్ధాంతపార్టీ గా కొనసాగి ఉంటే బాగుండేది. అధికారానికి వచ్చిన వెంటనే, తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం, తనకు మించిన ‘శక్తి కేంద్రం’ మరొకటి లేకుండా చూడడం, కెసిఆర్‌ తక్షణ కర్తవ్యాలుగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి, కెసిఆర్‌ ముఖ్యమంత్రి అయిన నాటికి, కాంగ్రెస్‌ పార్టీ బిక్కచచ్చిపోయి ఉన్నది. తెలుగుదేశం పార్టీకి ఓ మోస్తరు సీట్లు వచ్చినా, పెద్దచేప ధాటికి సొంతంగా నిలబడలేదని తెలిసి పోతూనే ఉంది. కానీ, కెసిఆర్‌, ఆయన టిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే కాక, తెలంగాణ సాధనలో కీలకపాత్ర వహించిన సకల జనుల వేదికలు, వారి పౌరసమాజం బలంగా ఉన్నాయి. యావన్మంది ప్రజలను తన పార్టీకి ఓటర్లుగా, పథకాల లబ్ధిదారులుగా మార్చుకోవడం, పౌరసమాజశక్తిని నిర్వీర్యం చేయడం తన కర్తవ్యాలని కెసిఆర్‌ అనుకున్నారు. తన జనాకర్షణను పెంచు కోవడం, పార్టీ నిర్మాణం తను, తన కుటుంబం చుట్టూ జరిగేట్టు చూడడం ప్రాధాన్యాలుగా మారిపోయాయి. అతి త్వరలోనే, ఉద్యమంలో కెసిఆర్‌ తో పాటు నడిచిన శక్తులన్నీ వేరుపడడమో, బలహీనపడడమో జరిగింది. తమ పాలన మీద పౌరసమాజం అజమాయిషీ, సమీక్ష ఉంటుందని చెప్పిన మాట గాలికి పోయింది. ప్రభు త్వానికి, సమాజానికి మధ్య ఎటువంటి సంభాషణలూ లేవు. నివేదనలకు, వ్యక్తీకరణలకు, ప్రజా భాగస్వా మ్యానికి ఆస్కారమే లేకపోయింది.

తనను దూరం పెట్టినందుకు, పౌరసమాజం కెసిఆర్‌ మీద విమర్శ ప్రారంభించిందనుకుంటే పొరపాటు. ఆ దూరం వల్ల ప్రభుత్వమే క్షేత్రవాస్తవికతకు క్రమంగా అపరిచితం అయిపోతూ వచ్చింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా, అభిప్రాయం అడిగితే, కోదండరామ్‌ సంతృప్తి కరంగా ఉందని చెప్పారు. రెండో సంవత్సరమూ అదే జవాబు చెప్పారు. కొంత అసంతృప్తి ఉన్నా, బయటకు చెప్పవలసినంత లేదనో, ఇంకా కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనో అనుకుని ఆయన అట్లా చెప్పి ఉంటారు. కెసిఆర్‌ పాలన మీద కొద్ది నెలల్లోనే అసంతృప్తిని ప్రకటించినవారున్నారు. నాలుగైదేళ్లు ఆగి మాట్లాడినవారున్నారు. పదేళ్ల పాలన దాకా కూడా ఏ విమర్శా చేయని వారున్నారు. ఆశాభంగాలను సహించే శక్తీ అందరికీ ఒకేరకంగా ఉండదు. అట్లాగే, పౌరసమాజమూ ఒకే రకంగా ఉండదు. అభి ప్రాయాల్లో, అంచనాల్లో వైవిధ్యం ఉంటుంది. సహజం గానే, ఏ అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుందో, ఆ అభిప్రాయమే స్థిరపడుతూ ఒక కథనం (నెరేటివ్‌) గా ఏర్పడుతుంది.

పదహారునెలల కిందట జరిగిన ఎన్నికలలో పరాజయం పొందిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)కి, తెలంగాణ పౌరసమాజంతో ఇంకా సమస్యాత్మక సంబంధమే కొనసాగుతోంది. నిజానికి ప్రతిపక్షంగా మారిన పార్టీకి పౌరసమాజానికి సహజమైన సఖ్యత ఏర్పడాలి. కానీ, అట్లా జరగలేదు. బిఆర్‌ఎస్‌ అధికారపక్షంగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఆ సంబంధమే కొనసాగుతోంది. అధికారం నుంచి దిగిపోయినా తామే అధికారపక్షం అన్నట్టు పౌరసమాజం వ్యవహరిస్తోందని బిఆర్‌ఎస్‌, ప్రజాజీవితం మీద బీఆరెస్‌ పదేళ్ల పాలన ప్రభావ భారం ఇంకా వదలలేదని పౌరసమాజం అంటున్నాయి. పౌర సమాజ ప్రతినిధులు పక్షపాతం తో ఉన్నారని, ద్వంద్వ విలువలు పాటిస్తున్నారని, రేవంత్‌ రెడ్డి ప్రాపకం కోసం చూస్తున్నారని సోషల్‌ మీడియా లో విమర్శలు గుప్పిస్తూ, వారి విశ్వసనీయత మీద బీఆర్‌ఎస్‌ శిబిరం దాడి చేస్తున్నది.

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ పెద్ద పొరపాటు చేయబట్టి కానీ, 2018 లోనే టిఆర్‌ఎస్‌ కు గట్టి దెబ్బ తగిలి ఉండేది. మరో దఫా అధికారంతో కేసీయార్‌ మరింత నిశ్చింతలోకి పడిపోయారు. దశాబ్ది కాలం తెలంగాణ తరహా అభివృద్ధి, పరిపాలన అన్న ప్రత్యేకత ఏమీ లేని విధంగా, రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు మిశ్రమగతిలో కెసియార్‌ ప్రభుత్వ పాలన కొనసాగింది. నేరుగా ఓటర్లకు లబ్ధి అందించే పథకాల వల్ల, ప్రాథమిక సదుపాయాలకు, దీర్ఘకాలిక వ్యవస్థలకు ధనమే లేకపోయింది. విద్య, వైద్యం దారుణ నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నాయి. నీటిపా రుదల ప్రాజెక్టులలో ప్రాధాన్యం తెలంగాణా అవ సరాలా, రాజకీయ ధనావసరాలా తెలియని పరిస్థితి. ధర్నాచౌక్‌ మూతపడిరది.చిన్న కార్యక్రమమైనా దిగ్బంధాలే. నేతల పర్యటనలంటే ఊళ్లన్నీ గృహ నిర్బం ధాలే. ఇష్టపడిన నేతను, గెలిపించుకున్న నాయకుడిని ఎవరూ అకారణంగా వ్యతిరేకించరు. 2023 ఫలితం వెనుక ఒక నేపథ్యం ఉన్నది. ప్రజల స్వానుభవం ఉన్నది.

నిజమే, బిఆర్‌ఎస్‌ ఓడిపోవడంలో పౌరసమాజం పాత్ర ఉన్నది. అనేక సందర్భాలలో కాంగ్రెస్‌ తో సమన్వ యంతో కూడా అది పనిచేసింది. మరో రకంగా చెప్పాలంటే, బిఆర్‌ఎస్‌ పాలన మీద పౌరసమాజం నిర్మించిన అసమ్మతిని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నది. ఏ పక్షం వైపు ఉండకూడని పౌరసమాజం ఆ పని ఎందుకు చేసింది? సాంకేతికంగా, కాంగ్రెస్‌ తో భాగస్వామిగా వారు లేరు. కానీ, రాహుల్‌ పాదయాత్రలోని జాతీయ అంశాలతో పౌరసమాజానికి ఏకీభావం ఉన్నది. కేసీయార్‌ ప్రభుత్వాన్ని ఓడిరచాలన్న పౌరసమాజం ఆకాంక్షకు, కాంగ్రెస్‌ ప్రయోజనాలకు పొత్తు కుదిరింది. రాహుల్‌ యాత్ర సందర్భంగా సమాజ ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు కూడా. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ మీద పెరుగుతున్న వ్యతిరేకత, దేశవ్యాప్తంగా బిజెపి బలపడకుండా నిరోధించవలసిన బాధ్యత, ఈ రెంటి రీత్యా, పౌరసమాజం కాంగ్రెస్‌ కు అనుకూల వైఖరి తీసుకున్నది. కర్ణాటక లో బీజేపీ ఓటమిలో సివిల్‌ సొసైటీ నిర్వహించిన పాత్ర ఒక ప్రేరణ అయింది. బిఆర్‌ఎస్‌ కు ఇప్పుడు తెలంగాణ పౌరసమాజం మీద పీకలదాకా ఉన్న కోపానికి నేపథ్యం ఇది.

రేవంత్‌ రెడ్డి అధికారానికి వచ్చాక, మొత్తం మీద వాతావరణంలో వచ్చిన ఒక వెసులుబాటు తప్ప, పెద్ద మార్పులేమీ లేవు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేక పోతున్నారు. ప్రత్యేకతలూ ఏమీ చూపలేకపోతున్నారు. ప్రజలలో కొంత అసంతృప్తి మొదలైంది కానీ, అది ఇంకా ఒక రూపం తీసుకోలేదు. ఒక స్తబ్ధత నెలకొ న్నట్టు కనిపిస్తోంది. పాలన మొదలై ఏడాది దాటినా ఇంకా కాంగ్రెస్‌ ను గట్టిగా విమర్శించడం లేదని, ఇంకా పాత ప్రభుత్వం తప్పులనే ప్రస్తా విస్తున్నారని బిఆర్‌ఎస్‌ నాయకులకు పౌరసమాజం మీద ఫిర్యాదు. దాని మీద సోషల్‌మీడియాలో ఇప్పుడు పెద్ద ఉద్యమం కూడా నడిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాలన్నిటా ప్రథమంగా బిఆర్‌ఎస్‌ ట్రోలింగ్‌కు, దూషణలకు గురవుతున్నది ఈ పౌరసమాజ ప్రతినిధులే. లెఫ్ట్‌, లిబరల్‌ సర్కిల్స్‌ మీద బిజెపి అనుకూలురు సోషల్‌ మీడియాలో ఎటువంటి భాష, వ్యక్తీకరణ, తర్కం వాడతారో వీళ్లు కూడా దాదాపు వాటినే వాడుతు న్నారు. ‘ఈ విమర్శ చేసినప్పుడు ఆవిమర్శ ఎందుకు చేయవు? వారినన్నప్పుడు వీరినెందుకు అనవు? ఎక్కడినుంచో డబ్బులువస్తున్నాయి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు, వాళ్లకో వీళ్లకో తొత్తువు కదా?’ ఇట్లాగే ఉంటున్నాయి వ్యాఖ్యలు! పౌరసమాజ ప్రతినిధులు పక్షపాతంతో వ్యవహ రించడం కానీ, బిఆర్‌ఎస్‌ అభిమానులు చెబుతున్నట్టు ప్రలోభాలకు, పదవులకు లొంగిపోవడం కానీ సామాన్యంగా జరగదు. సమాజంలో పెద్దమనిషిగా గుర్తింపు ఎన్నికల ద్వారానో డబ్బు ద్వారానో వచ్చేది కాదు. దీర్ఘకాలిక ఆచరణ, వైఖరుల కారణంగా ఆ స్థాయి సంక్రమిస్తుంది. అనుక్షణం వారి నైతిక స్థాయిని సమాజం నిత్యం గమనిస్తూ ఉంటుంది. వారిలో ఎవరైనా ఒకవేళ ఏవైనా అధికార బాధ్యతలు తీసు కోవలసి వస్తే, అప్పటినుంచి వారు పౌరసమాజంలో భాగంగా పరిగణన పొందరు. ఒక వైఖరి తీసు కోవడంలో ఎంతో సమదృష్టితో వ్యవహరి ంచగలిగిన వారే పెద్దమనుషులవుతారు.

నిజమే, బిఆర్‌ఎస్‌ ఓడిపోవడంలో పౌరసమాజం పాత్ర ఉన్నది. అనేక సందర్భాలలో కాంగ్రెస్‌ తో సమన్వయంతో కూడా అది పనిచేసింది. మరో రకంగా చెప్పాలంటే, బిఆర్‌ఎస్‌ పాలన మీద పౌరసమాజం నిర్మించిన అసమ్మతిని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నది. ఏ పక్షం వైపు ఉండకూడని పౌరసమాజం ఆ పని ఎందుకు చేసింది? సాంకేతికంగా, కాంగ్రెస్‌ తో భాగస్వామిగా వారు లేరు. కానీ, రాహుల్‌ పాదయాత్రలోని జాతీయ అంశాలతో పౌరసమాజానికి ఏకీభావం ఉన్నది. కేసీయార్‌ ప్రభుత్వాన్ని ఓడిరచాలన్న పౌరసమాజం ఆకాంక్షకు, కాంగ్రెస్‌ ప్రయోజనాలకు పొత్తు కుదిరింది.

ఒక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో కానీ, ఒక అధికారమార్పిడి కోసం కానీ స్వతంత్రంగా లేదా పౌరసమాజంలో భాగంగా పనిచేసినవారు, ఆ ఉద్యమం ఫలించిన తరువాత, అధికారమార్పిడి జరిగిన తరువాత, కొత్తప్రభుత్వంలో ఏవైనా బాధ్యతలు తీసుకోవచ్చు. రాజ్యవ్యవస్థలలో భాగం కావచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత కానీ, అనేకమంది ఉద్యమకారులు పదవులు, బాధ్యతలు తీసుకున్నారు. అందులో తప్పు పట్టవలసిన పనిలేదు. నవ నిర్మాణానికి కూడా నిబద్ధులు, సమర్థులు కావాలి కదా? కొందరు పౌరసమాజ ప్రతినిధులు, కెసిఆర్‌ హయాంలో పదవులు తీసుకున్నవారిని ఉద్యమద్రోహులన్నట్టు మాట్లాడేవారు. అది సరికాదు. ఆ పదవుల నిర్వహణ తీరు మీద విమర్శించవచ్చును కానీ, అందరూ ఒకే తీరుగా ఉండాలని ఎట్లా శాసించ గలరు? నిజానికి కెసిఆర్‌ పదవులు ఇచ్చినవారిలో అత్యధికులకు వాటిని నిర్వహించే వెసులుబాటు ఇవ్వలేదు. కొందరు చొరవ కలిగినవారు పట్టుదలతో వ్యవహరించగలిగారు. అత్యధికులు వాహనాలకు వేతనాలకు మాత్రమే పరిమితమయ్యారు.

మంత్రు లకే తగిన ప్రతిపత్తి లేని స్థితి ఆనాటిది. అట్లాగే, ఇప్పుడు కూడా ఎవరైనా కాంగ్రెస్‌ పదవీబాధ్యతలు తీసుకుంటే, వారు పౌరసమాజంలో భాగం కాకుండా పోతారు తప్ప, ప్రజావ్యతిరేకులేమీ కారు. ప్రయో జనాల నేపథ్యం ఉందనుకుంటే, వారి వ్యాఖ్యల విలువ భిన్నంగా మారిపోతుంది. పౌరసమాజ ప్రతినిధులు అనేకులు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొందరు ప్రముఖులు అంత తరచుగా కానీ, తీవ్రంగా కానీ, మొత్తంగా కానీ చేయకపోవచ్చు. కెటిఆర్‌, హరీశ్‌ రావులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కానీ, కెసిఆర్‌ అట్లా చేయడం లేదు కదా? కొంత సమయం ఇచ్చి చూడాలని కెసిఆర్‌ అనుకున్నట్టే కొందరు పెద్దమ నుషులు కూడా అనుకుని ఉండవచ్చు. నిజానికి పౌరసమాజంలోపలే, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కొన్ని విషయాలలో గట్టిగా నిలదీయాలని, విమర్శించాలని చర్చ జరుగుతోంది. బిఆర్‌ఎస్‌ బలంగా లేని స్థితిలో, కాంగ్రెస్‌ మీద విమర్శ బిజెపిని బలపరుస్తుందన్న వాదన కూడా కొందరు చేస్తున్నారు.

బిఆర్‌ఎస్‌ పాలన జాపకాలు పౌరసమాజాన్నే కాదు, తెలంగాణ సమాజాన్నీ ఇంకా వదిలిపెట్టడం లేదు. వర్తమానం లో ఏమిజరిగినా, కెసిఆర్‌ హయాం కూడా గుర్తుకు వస్తోంది. దుష్పరిపాలనలో రేవంత్‌రెడ్డి ఇంకా చెలరేగిపోతే, రేపు కెసిఆర్‌పాలన మరపులోకి వెళ్లవచ్చు. లేదా, కెసిఆర్‌, ఆయన పార్టీ గతంలో జరిగిందానికి కొంతైనా పశ్చాత్తాపం ప్రకటించి, ఆ నైతిక ధైర్యంతో, గతంలో తాను చేసిన తప్పులనైనా సరే ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖండిస్తూ పోవచ్చు. జనం నెమ్మదిగా వర్తమానంలో కుదురుకుంటారు. ఎమర్జెన్సీనే క్షమించి, మూడేళ్లకే ఇందిరను వరించిన సమాజం, కెసిఆర్‌ను మాత్రం స్వీకరించకుండా ఉంటుందా? కాకపోతే, కొంత వినయం వందనం అవసరం. కనీసం, చేసిన తప్పులను అయినా తిరిగి చేయకుండా ఉండాలనుకోవడం ముఖ్యం.

పౌరసమాజం తనని తాను విమర్శించుకుని, సవరించుకుంటుంది. రాజకీయపార్టీలు కూడా ఆత్మ విమర్శలు చేసుకోవాలి. పౌరసమాజాన్ని అల్లరిపెట్టి కానీ, లేదా తమ రేటింగ్‌ మార్చమని ఒత్తిడిచేసి కానీ, ప్రతిష్ఠను కాపాడుకోవాలనుకోవడం పొరపాటు. రాజకీయాలను, పార్టీలను విమర్శించే కర్తవ్యం, బాధ్యత పౌరసమాజానికి ఉంటాయి కానీ, పౌరస మాజాన్ని నిలదీసి, ట్రోల్‌ చేసి బాధించే హక్కు, నైతికఅధికారం రాజకీయపార్టీలకు ఉండదు. పౌరసమాజం అన్నది ఒక గౌరవనీయ రణరంగం. అక్కడ పోటీపౌరసమాజాన్ని నిర్మించుకోవాలి తప్ప, ఈలలు వేసి, గోల చేయకూడదు. ఇదే పౌరసమాజం రేపు మీకో, వారికో,మరొకరికో కూడా సానుకూల వాతావరణాన్ని నిర్మిస్తుంది, ప్రజలతో ఉండగలిగితే. సామాజిక మాధ్యమాలు పౌరసమాజానికి, రాజకీయ పార్టీలకు వేదికలు మాత్రమే తప్ప, రాజకీయపార్టీల సోషల్‌ మీడియా విభాగాలు పౌరసమాజానికి ప్రత్యామ్నాయాలు కావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *