– ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు
– హరీష్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ హరీష్ రావు అమెరికా నుంచి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పొంగులేటి పోస్టు పెట్టారు. బీఆర్ఎస్‌లో తన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ భూములపై అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకున్నారా అంటూ నిలదీశారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఒక్క మెట్రో స్టేషన్ కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కొత్త నగరాన్ని నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం ఫాంహౌస్‌లు కట్టుకుందని, కానీ తాము రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నామని ఉద్ఘాటించారు. మూసీ ప్రక్షాళన, లగచర్ల ఇండస్ట్రీస్‌కు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలను కుట్రలతో అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం గర్వించే విధంగా తాము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు రాజకీయ భవిష్యత్తు ఖతం చేయాలని బీఆర్ఎస్ నేతలే చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





