కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

– లారీని ఢీకొన్న క్రూజర్.. ఐదుగురు దుర్మరణం

బెంగళూరు, మే 23: కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను క్యాష్వార్, హుస్సేన్, అలీ, రసూల్, ఫాతిమాగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద తీవ్రతకు క్రూజర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఐదుగురు మృతిచెందడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *