– హరీష్ రావు అరెస్ట్
– పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : బీఆర్‌ఎస్ ఎల్పీఉప నేత తన్నీరు హరీష్ రావును హనుమకొండ సుబేదారిలో పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులకు హరీష్ రావు మద్దతు తెలిపారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం సమీపం లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు వెళుతున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపిన తర్వాత హరీష్ రావును అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త త వాతావరణం నెలకొంది. హరీష్ రావును సమీపంలోని సుబేదారి పోలీసు స్టేషన్ కు కాలినడకన తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు సుబేదారి పీఎస్ కు తరలివచ్చి స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. అలాగే జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు వస్తున్న నేపథ్యంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపించారు. అలాగే వరంగల్, హనుమకొండలో విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు.
జీ.ఒ. 97ను రద్దు చేయాల్సిందే : హరీష్ రావు డిమాండ్
పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని అన్నారు. హనుమకొండలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆయనను కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 97 జీ.ఒ.ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యార్థుల ఉద్యమాలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జెన్‌జీ ఉద్యమాలపై కాంగ్రెస్‌కు దిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో మరో నీతి ఏంటని దుయ్యబట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





