పోలీసు సిబ్బందికి మార్గదర్శి ‘బిజినెస్ రూల్స్’

– హ్యాండ్ బుక్‌ను ఆవిష్కరించిన డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: డీజీపీ కార్యాలయంలో సిబ్బంది విధుల నిర్వహణ, సర్వీసు నిబంధనలపై స్పష్టతనిచ్చే ‘బిజినెస్ రూల్స్ అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌’ బుక్‌లెట్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. తన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం పోలీసు అధికారులకు, సిబ్బందికి ఒక కరదీపికలా, మార్గదర్శిలా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల, సిబ్బంది సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించే సమయంలో పాటించాల్సిన విధానాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు. తాను గతంలో పర్సనల్ అడిషనల్ డీజీపీగా ఉన్న సమయంలోనే ఈ తరహా నిబంధనల ఆవశ్యకతపై చర్చించానని, అందుకు అనుగుణంగానే సర్వీస్ రూల్స్ రివిజన్ కమిటీ చైర్మన్ వై.గంగాధర్ పలువురితో సంప్రదించి ఈ నియమాలను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. నూతనంగా వెలువడుతున్న జీవోలు, మారుతున్న విధానాలకు అనుగుణంగా సిబ్బందికి అర్థమయ్యేలా దీనిని తీర్చిదిద్దిన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ప్రశంసించారు. కమిటీ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ సర్వీసు నిబంధనలపై క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం, ఎదుర్కొంటున్న విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. డీజీపీ సూచనల మేరకు సిబ్బందికి ప్రయోజనం చేకూరేలా సమాచారాన్ని క్రోడీకరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, సీఐడి అడిషనల్ డీజీపీ చారుసిన్హా, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ నాయుడు, గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *