– ట్యాంక్ బండ్ వద్ద ప్రజా సంఘాల మానవహారం
– పాల్గొన్న పరకాల ప్రభాకర్, ప్రొఫెసర్ శాంతా సిన్హా తదితరులు
– జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
– వోటు హక్కును పునరుద్ధరించాలని నినాదాలు
– పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్, పౌర సమాజ, మానవ హక్కుల సంఘాల ఐక్య వేదిక
హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: లక్షలాది మంది పౌరుల ప్రజాస్వామిక వోటు హక్కులను పునరుద్ధరించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే రద్దుచేయాలని, జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని, సీఈసీ చట్టం–2023ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద రెండు వేల మందికి పైగా పౌరులు , నివాసితులు భారీ మానవహారంలో పాల్గొన్నారని పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్ , పౌర సమాజ, మానవ హక్కుల సంఘాల ఐక్యవేదిక ఒక ప్రకటనలో తెలిపింది. తొలగించిన వోటర్లందరినీ తక్షణమేతిరిగి జాబితాలో చేర్చాలని వారుడిమాండ్ చేశారు. పౌర సమాజ, మానవహక్కుల, రైతు, దళిత, యువజన మరియు విద్యార్థి సంఘాల విస్తృత వేదిక ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ మానవహారాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏకంగా 13.4 కోట్ల మంది వోటర్లను వోటర్ల జాబితాల నుండి తొలగించిన నేపథ్యంలో ఎస్ఐఆర్ అనేది వోటర్ల ధ్రువీకరణ’ కాదని, ఇదొక ‘సామూహిక వోటర్ల తొలగింపు ప్రక్రియ అని వారు పేర్కొన్నారు.ఈ మానవహారంలో అన్ని రంగాల పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు, యువత, పౌర సమాజ కార్యకర్తలు, విద్యావేత్తలు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో 73 లక్షల మంది పేర్ల తొలగింపు 

రాష్ట్రంలో ఇప్పటికే 73 లక్షల మంది పేర్లను వోటర్ల జాబితా నుండి తొలగించారని, మరో 93 లక్షల మందికి అనుమానాస్పద వోటర్లుగా నోటీసులుఅందుతున్నాయని, ఈ పరిస్థితుల్లో దాదాపు 50% మంది వోటర్లను తొలగించే అవకాశం ఉన్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వెనుకగల ఉద్దేశ్యం, ఔచిత్యంఏమిటని పలువురు ప్రశ్నించారు. ఇది దేశంలోనే అత్యధిక శాతం అని, ప్రజలుప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి బదులుగా ప్రభుత్వమే వోటర్లను ఎంచుకుంటున్న విపరీత పోకడకు ఇది నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా లక్షలాదిమంది భారతీయులు ప్రత్యేకించి యువత శాంతియుత ప్రతిఘటనకు ధైర్యంగా నాయకత్వం వహిస్తున్నారని, ఈ పోరాటంలో తెలంగాణ సంపూర్ణ భాగస్వామ్యం వహిస్తోందని పాల్గొన్న వారు స్పష్టం చేశారు. నిరసనకారులపై, ముఖ్యంగా దిల్లీలో జరిగిన క్రూరమైన పోలీసు హింసను ఖండిస్తూ, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన విడదీయరాని ప్రాథమిక హక్కని ఉద్ఘాటించారు. అక్టోబర్ లోనేహైదరాబాద్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పలు నిరసనలు జరిగాయని, అందులోభాగంగా బాధితులు ప్రముఖ నిపుణుల కమిటీ ఎదుట తమ సమస్యలను వెల్లడించినకీలక ప్రజా వేదిక కూడా జరిగిందని గుర్తుచేశారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ లక్షలాది మంది సాధారణ పౌరులకు—ముఖ్యంగా మహిళలు, శ్రామిక పేదలు,ముస్లింలు సహా మైనారిటీలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులతో పాటు తీవ్రపనిభారంతో సతమతమవుతున్న బి.ఎల్.ఓ లకు కూడా తీవ్ర మానసిక వేదనను మిగులుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్నిరక్షించుకుంటా మని ‘వోట్ బచావో, దేశ్ బచావో’ అంటూ సామూహిక ప్రమాణం చేశారు. హైదరాబాద్ ,తెలంగాణలో భారీ ఎత్తున వోట్ల తొలగింపుల నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచార కరపత్రాలను బాటసారులకు పంపిణీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





