– ఫల్తా గెలుపుతో టీఎంసీకి బీటలు
కోల్‌కతా, మే 25 : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ కుదుపు చోటుచేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉత్కంఠభరిత రీపోలింగ్‌లో బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ రీ పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా 1,08,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు. తృణమÖల్ కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్ తగిలి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక్కడి అభ్యర్థి పోలింగ్‌కు ముందే చేతులెత్తేశారు. విజయం సాధారణమైనది కాదు.. ఎందుకంటే ఫల్తా టీఎంసీ నెంబర్`2, ఎంపీ అభిషేక్ బెనర్జీకి చెందిన డైమండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఒకప్ప్పుడు తృణమÖల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో కమలం వికసించడం ఇక మమతా బెనర్జీ హవాకు బ్రేకులు పడ్డాయనే సంకేతాన్ని ఇస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ స్థానానికి ఏప్రిల్ 29న పోలింగ్ జరగగా ఆ సమయంలో అధికార టీఎంసీ ఈవీఎంల తారుమారుకు పాల్పడిందని, బూత్ క్యాప్చరింగ్, ఓటర్లను బెదిరించడం వంటి అక్రమాలకు ఒడిగట్టిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం ఆ ఎన్నికను రద్దు చేసి ఈనెల 21న కట్టుదిట్టమైన కేంద్ర బలగాల నిఘాలో మొత్తం 285 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించింది. 88 శాతం ఓటర్లు తరలివచ్చి ప్రశాంతంగా ఓటు వేశారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. రౌండ్ రౌండ్‌కూ మెజారిటీ పెరుగుతూ పోయింది. ముందే ఓటమిని పసిగట్టిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తాను రీపోలింగ్‌లో నిలబడనని ముఖం చాటేయడం గమనార్హం. అయితే ఆయనకు ఈ ఎన్నికల్లో దక్కింది ఏడు వేల పైచిలుకు ఓట్లే. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న మాజీ సీఎం మమతా బెనర్జీ ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఏజెంట్లలా నటిస్తూ కేంద్ర బలగాలు కౌంటింగ్ కేంద్రాల్లోకి దూరి ఓట్లను మళ్లీ దొంగిలించాయంటూ మండిపడ్డారు. మరోవైపు ఈ ఘనవిజయంపై సీఎం సువేందు అధికారి స్పందిస్తూ టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అభిషేక్ బెనర్జీ చెప్పే ’డైమండ్ హార్బర్ మోడల’ కాస్తా ఇప్ప్పుడు ’తృణమÖల్ నష్ట నమÖనా’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తాను ప్రజలను లక్ష మెజారిటీ అడిగితే వారు 1.08 లక్షల మెజారిటీతో నమ్మకాన్ని నిలబెట్టారని, ఫల్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మళ్లీ ’స్వర్ణ వైభవాన్ని’ తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



