– మహారాష్ట్రలో ఘటన : 8 మంది దుర్మరణం
ముంబై, మే 25 : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయగఢ్‌లోని అంబెనాలి ఘాట్ సవిÖపంలో నదీ లోయలోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిదిమంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మహాబలేశ్వర్, పొలాద్‌పూర్ మధ్య ఉన్న అంబెనాలి ఘాట్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిదిమంది మృతిచెందినట్లు సమాచారం. నది 500 నుంచి 700 అడుగుల లోతు వరకు ఉంటుందని అంచనా. స్కార్పియోను ఎస్‌యÖవీ సతారా జిల్లాలోని ఆస్‌గావ్‌కు ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బాధితులంతా సతారాకు చెందినవారని తెలుస్తోంది. వారు దాపోలి నుంచి సతారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





