ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ కార్యాచరణ

– ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం
– గెలుపు లక్ష్యంగా కీలక సన్నాహక సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : మహబూబ్‌నగర్-రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ (ఫామ్-18) అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల క్షేత్రంలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన కీలక సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ఉమ్మడి పది జిల్లాలను, దాదాపు 76 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఈ రెండు ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడంతోపాటు బూత్‌స్థాయి నుంచే బలమైన కార్యాచరణను రూపొందించేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీఆరఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలని విద్యావంతులకు పిలుపునిచ్చారు. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు 76 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపనున్నాయి. ఈ స్థానాలు బీజేపీకి అత్యంత ముఖ్యమైనవి, ప్రతిష్ఠాత్మకమైనవి కావడంతో పార్టీ ఇప్పటికే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అన్ని స్థాయిల్లోనూ సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది. ఉమ్మడి ఏపీలో జనసంఘ్ కాలం నుంచే ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన ప్రజాదరణ, క్షేత్రస్థాయి పట్టు ఉన్నాయి. నేటికీ విద్యావంతుల్లో బీజేపీకి బలమైన మద్దతు కొనసాగుతోంది. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ పూర్తి ఐక్యతతో, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటుందని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపై నిలిచి గెలుపు కోసం అంకితభావంతో పనిచేయాలని రామచందర్‌రావు కోరారు. రెండు స్థానాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధిస్తుందన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణకు నిలబడటానికి, ప్రభుత్వాలకు స్పష్టమైన ప్రజాస్వామ్య సందేశాన్ని ఇవ్వడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులకు ఒక గొప్ప అవకాశమంటూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు ముందుకొచ్చి తమ గళాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *