ఐక్యత, అభివృద్ధికి పెద్ద పీట

– కేరళంలో యూడీఎఫ్ విజయంపై మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగబద్ధమైన విలువల కోసమే పోరాడుతుందని, కేరళంలో విజయం ఆ పోరాటానికి దక్కిన గుర్తింపు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.నైదు రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై ఆయన మాట్లాడుతూ కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయం ప్రజాస్వామ్య విలువలపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని, విద్వేషపు రాజకీయాలపై వివేకపు గెలుపు అని పేర్కొన్నారు. విభజన రాజకీయాల కంటే అభివృద్ధి, ఐక్యత, లౌకిక విలువలకే ప్రజలు పెద్దపీట వేస్తారని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయన్నారు. కేరళం ప్రజలు విద్వేషానికి తావు లేకుండా అభివృద్ధిని, ఐక్యతను ఎంచుకుని దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనయాడారు. కేరళంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శించిన పోరాట పటిమ అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు, తమపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడూ మనుషులను కలపడమే కానీ విడదీయడం కాదు.. కాంగ్రెస్ ప్రయాణం ఎప్పుడూ ప్రజల హితం కోసమే.. రాహుల్ గాంధీ నాయకత్వంలో తాము నమ్ముకున్న ‘ప్రేమ – సామాజిక న్యాయం’ అనే మార్గమే సరైనదని కేరళం తీర్పు బలపరిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ ముందుకు సాగుతామన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వస్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తామన్నారు. 2029లో దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధిస్తుందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళంలో ఘన విజయం సాధించిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను శ్రీధర్ బాబు ఫోన్ లో అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *