రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– రైతు వారోత్సవాలు ప్రారంభించిన మంత్రి తుమ్మల
– రైతు ఆర్గానిక్ మొబైల్ యాప్ ప్రారంభం

తాండూరు, ప్రజాతంత్ర, మే 4: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -నాగేశ్వరరావు పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమం లో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -నాగేశ్వర రావు. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాలు నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో -ఏర్పాటు చేసిన రైతు వారోత్స వాల కార్యక్రమం లో ముఖ్య “అతిధి గా పాల్గొని మాట్లాడారు. జిల్లా లో 99 రోజుల ప్రజా -పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈరోజు నుండి మే 9 వరకు రైతు వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ గీతం తో పాటు జ్యోతి ప్రజల్వన తో కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ప్రయత్నం చేయక పొతే భవిష్యత్తు లో భూమి మొత్తం నిస్థార -మవుతుందని, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ పంటలు -పండించేలా రైతులు ముందుకెళ్లాలని, ఆర్గానిక్ పంటల సాగు పై రైతులు ద్రుష్టి పెట్టాలన్నారు. భూములను రక్షించి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. సైంటిస్ట్ లు భూమిని ఎ రకంగా సంరక్షించు కోవాలో అవగాహనా కలిపిస్తారని తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయుటకు ఒక లక్షా 40 వేల కోట్లు రైతుల ఖాతాల లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి గారి ప్రయత్నం తో 90 కోట్ల మంజూరు తో కోట్ పల్లి ప్రాజెక్టు తెచ్చారని, 40 నుండి 50 వేల క్వింటాల దాక మొక్క జొన్న పందడిస్తున్నామని, భారత దేశం లో అత్యధిక పంటలు పండించే రైతులు తెలంగాణ రైతు లేనని, ప్రభుత్వం ఎక్కువ మొత్తం లో వరి కొనుగోలు చేస్తుందని అన్నారు. నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజ మాన్యం, ప్రకృతి వ్యవసాయం, పై అవగాహనా కలిపించు కోవాలన్నారు. ప్రకృతి పంటలు పండించిన లావణ్య రెడ్డి తో కలిసి టి జి ఆన్లైన్ యాప్ ను ప్రారంభించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ, మత్స్య శాఖ వివిధ శాఖ లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు . స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక వంటి వాడు, వ్యవసాయం దండగ కాదు., వ్యవసాయం ఒక పండుగ, మంత్రి చొరవ తో వ్యవసాయ రంగాన్నే ముందుకు తీసుకెళ్తున్నమ్మన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే అభివృద్ధి జరగా లనే ఉద్దేశం తో రైతులు ప్రకృతి పంటల సాగు పై దృష్టి పెట్టాలన్నారు. ఎ ఓ లు, సైంటిస్ట్ ల సూచనలు పాటించి పొలాల్లో ఏయే పంటలు వేస్తె బాగుంటుందని వాటి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. 14 వేల కోట్లు మార్కెట్ కోసం మంజూరై య్యాని, అయిల్ ఫామ్ కంపెనీ జిల్లా కు మంజూరు ఐనదని, తాండూర్ కంది. పప్పుకు చాలా ప్రాముఖ్యత ఉందని, కంది బోర్డు ఏర్పాటు చేయాలనీ ఈ సందర్భంగా మంత్రి గారిని కోరారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ప్రజా పాలనా ప్రగతి-ప్రణాళిక లో భాగంగా ఈరోజు నుండి మే 9 వరకు రైతు వారోస్తావాలు ప్రారంభం, రైతులకు సంబందించి రైతు భరోసా, రైతు భీమా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరించడం, వారి సలహాలు సూచనలు. తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతులు, పలువురు. సైంటిస్ట్ లు మాట్లాడారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్మన్ కల్వ సుజాత, మార్కెట్ చైర్మన్ లు, ఎఎంసి చైర్మన్ లు, ఆత్మ చైర్మన్ లు, వ్యవసాయ శాఖ సిబ్బంది. ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మొక్కజొన్న, జొన్నను పిఎస్‌ఎస్‌లో చేర్చాలి
శనగ, పొద్దురుగుడుపై 25శాతం పరిమితిని ఎత్తివేయాలి

మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్‌ఎస్‌లో చేర్చి శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25శాతం కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని వ్యవసాjá శాఖ మంత్రి తుమ్మల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మరోమారు లేఖ ద్వారా కోరారు. రాష్ట్రంలో యాసంగిలో పండించిన వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలపై ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితులను కేంద్రం ఎత్తివేయాలని కోరారు. కేంద్ర పరిమితులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కోనుగోలు చేయడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని వివరించారు. సెంట్రల్ పూల్‌లో కేంద్ర నోడల్ సంస్థ ద్వారా శనగ పంటను 29,860 మెట్రిక్ టన్నులు (మొత్తం ఉత్పత్తిలో 25శాతం) కొనుగోలు చేయడానికి, అలాగే పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3690 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతించిందని, అయితే ఆ ప్రకారం కొనుగోలు గత వారమే పూర్తయిందని తెలిపారు. ఇంకా రైతుల వద్ద పంట మిగిలి ఉందని, మార్కెట్లకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం అనుమతించిన పరిమితులను ఇప్పటికే దాటినందున శనగ పంటల కొనుగోలు పరిమితిని 1,12,077 మెట్రిక్ టన్నులకు పెంచాలని, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లను 10,839 మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి కోరారు. ర్ఱాష్టంలో విస్తృతంగా పండే మొక్కజొన్న, జొన్న పంటను కేంద్రం పీఎసఎస్‌లో చేర్చి కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేపట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర రానందున ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 246 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రస్తుత రబీలో సుమారు 3.99 లక్షల మెట్రిక్ టన్నులు ఎంఎస్‌పీ వద్ద కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. గత ఖరీఫ్‌లో కూడా రాష్ట్రం సుమారు 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం భరించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ధర మద్దతు పథకంలో మొక్కజొన్న, జొన్న పంటలను చేర్చాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *