ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: భగీరథ మహర్షి జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితర నాయకులు, సగర సామాజిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతి వేడుకల సందర్భంగా ప్రజలకు పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. భగీరథుడు రామాయణంలో ప్రస్తావన ఉన్న మహనీయుడు మాత్రమే కాక సగర సామాజిక వర్గం దైవంగా భావించే ఆధ్యాత్మిక ప్రతీకగా నిలిచాడన్నారు. సమాజ నిర్మాణంలో సగర వర్గం సేవలను గుర్తుచేసుకున్నారు.

నోటీసిచ్చినా స్పందించకపోవడం శోచనీయం

ఆర్టీసీ కార్మికులు 41 రోజుల ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రామచందర్‌రావు అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించడం విచారకరమన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నదన్నారు. గతంలో కూడా కార్మికుల పక్షాన నిలిచినట్లే ఇపుడూ వారి హక్కుల కోసం అండగా ఉంటామని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించాలని పిలుపునిస్తున్నానన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చించకుండా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోందని, ప్రైవేట్ బస్సులను నడపడం ద్వారా ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తోందని ఆరోపించారు. గతంలో బీఆరఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే కార్మిక నాయకులను చర్చలకు ఆహ్వానించాలన్నారు. కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలు కార్మికుల సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రామచందర్‌రావు హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *