భగీరథ కమ్యూనిటీలో బతుకమ్మ సంబురాలు

– బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క
– యూనిఫాంలో స్టెప్పులేసిన మహిళా పోలీసులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో బుధవారం ఉత్సాహంగా సాగాయి. భగీరథ కమ్యూనిటీ సభ్యులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. మహిళా పోలీసులు మంత్రి సీతక్కతో కలిసి బతుకమ్మ పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ మహిళలు పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. మంత్రి సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడటంతో లోయర్ ట్యాంక్‌బండ్‌లో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *