అంబరాన్ని అంటిన‌ బతుకమ్మ సంబరాలు

– భక్తిశ్రద్ధలతో పాటలు పాడిన మహిళలు
– పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : బతుకమ్మ పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతికి ప్రతీక అని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని శాసనమండలి చైర్మన్ గుత్తా ఖేందర్ రెడ్డి కొనియాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాల్లో ప్రసాద్ కుమార్, సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొని ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. బంతి, చామంతి, గునుగు, తంగేడు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, మహిళా ఉద్యోగులు, సిబ్బంది చుట్టూ చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడారు. ఆడబిడ్డల ఆత్మీయత, ఉత్సాహం మధ్య సాగిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. అసెంబ్లీ ప్రాంగణం సోమవారం సాయంత్రం రంగురంగుల పూలతో, ఆడపడుచుల ఆనంద కోలాహలంతో కళకళలాడింది. బతుకమ్మ వేడుకల్లో శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు శాసనసభ సెక్రటరీ ఆర్.తిరుపతి, శాసనసభ, శాసనమండలి ఉన్నతాధికారులు, మహిళా ఉద్యోగులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *