– అవార్డు అందుకున్న నారాయణపేట కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : నారాయణపేట జిల్లాలో ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన కార్యక్రమం అమలులో విశిష్ట సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ ప్రియాంక న్యూదిల్లీలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలులో జిల్లా యంత్రాంగం చేసిన కృషికి ఈ గుర్తింపు లభించడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడం, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాల్లో అధికారులు అంకితభావంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ అవార్డు సాధనలో భాగస్వాములైన జిల్లా అధికారులందరికీ, వారి బృందాలకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారం, కృషి, బాధ్యతాయుతమైన పనితీరు ఈ విజయానికి పునాది అని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే బృంద స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు జిల్లా అభివృద్ధిలో మరిన్ని మైలురాళ్లను సాధించాలని ఆకాంక్షించారు. నారాయణపేట జిల్లాకు లభించిన ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగానికి మరింత బాధ్యతను పెంచిందని, రానున్న రోజుల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




