– ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ కు పట్టిన గతే మోదీకి పడుతుంది
– ప్రజల గొంతు నొక్కిన పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
– మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన అదే విధానాన్ని ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. దేశ రాజధాని దిల్లీలో ప్రజలు, రాజకీయ పార్టీలు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు చారి త్రకంగా ఉపయోగించుకున్న జంతర్ మంతర్ వంటి నిరసన వేదికలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిరసన వేదికను తొలగిస్తే.. మోదీ ప్రభుత్వం దేశ రాజధాని దిల్లీలో నిరసనలకు ఆంక్షలు విధిస్తోందని, ఇద్దరి ఆలోచనా విధానం ఒక్కటేనని మంత్రి మండిపడ్డారు. ప్రజల సమస్యలను వినకుండా, ప్రతిపక్షాల గొంతును వినిపించకుండా, నిరసనలకు వేదిక లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజల గొంతును అణచివేయాలని చూసిన కేసీఆర్ కు ఎలాంటి రాజకీయ పరిణామం ఎదురైందో అదే పరిస్థితి భవిష్యత్తులో నరేంద్ర మోదీకి కూడా ఎదురవుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజల గొంతును అణచివేసే ప్రతి పాలకుడికి చివరకు ప్రజల తీర్పే సమాధానం అని మంత్రి హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




