– సీపీ సజ్జనార్ కీలక సూచనలు
హైదరాబాద్, నవంబర్ 9: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సైబర్ దాడులు పెరుగుతున్న తరుణంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల దాడులను ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలని స్పష్టం చేశారు. వినియోగంలో లేని పాత ఏపీఐలను, రక్షణ లేని పాత సాఫ్ట్వేర్లను వెంటనే తొలగించాలన్నారు. సైబర్ నేరగాళ్లు ఏఐ ఏజెంట్లతో సిస్టమ్‌లలోని లోపాలను గుర్తించి పేమెంట్ ఏపీఐల ద్వారా మ్యూల్ ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తున్నారని తెలిపారు. అసాధారణ లావాదేవీలను గుర్తించేందుకు తగిన పరిమితులు విధించాలని, నగదు విడుదల చేసే వ్యవస్థలకు పటిష్ట రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి నగదు బదిలీకి ముందు పూర్తిస్థాయి కేవైసీ తప్పనిసరి చేయాలని, భారీ మొత్తాల లావాదేవీలకు ఉన్నతాధికారుల ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ, సైబర్ భద్రతా బృందాలు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని, సైబర్ దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ‘రెడ్ టీమ్ మాక్ డ్రిల’ నిర్వహించాలని కోరారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




