– తప్పు చేయనప్పుడు పాలకులు దేనికి భయపడుతున్నారు
– న్యాయవాదులను కలవనివ్వకుండా పోలీసులు బెదిరిస్తున్నారు
– సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ధ్వజం
న్యూదిల్లీ, అక్టోబర్ 13 : దేశంలో నియంతృత్వ ధోరణి నడుస్తోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రస్థా యిలో మండిపడ్డారు. పాలకులే స్వయంగా రాజ్యాంగ నిబంధనలను విస్మరిస్తూ ప్రతిపక్షాలను, ఉద్యమకారులను అణచివేస్తున్నారని విమర్శించారు. తాము ఎలాంటి తప్పూ చేయ నప్పుడు పాలకులు దేనికి భయపడి ఈ స్థాయిలో నిర్బంధాలు ప్రయోగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ నిరసనలకు సంబంధించి దిల్లీలో తమ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిని వేర్వేరు చోట్లలో నిర్బంధించారని దీప్కే తెలి పారు. దిల్లీలో అరెస్ట్ చేసిన అనంతరం తమ పార్టీ కీలక నేతలు అశుతోష్, అజింక్య, సౌర వలను ఒకేచోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఉంచినట్లు ఆయన ఆరోపించారు. వారితోపా టు అదుపులోకి తీసుకున్న 11 మంది వలంటీర్లను అజ్ఞాత ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. అరెస్టయిన నేతలను కలవడానికి తమ న్యాయవాదులు పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు పోలీసులు వారిని లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారని దీప్కే ఆరోపించారు. పార్టీకి చెందిన ఇతర సభ్యులను, నాయకులను కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు భయపడేది లేదని, రాజ్యాంగబద్ధ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




