– రాహుల్పై బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజం
– అవన్నీ అవాస్తవాలన్న కాంగ్రెస్
దిల్లీ, అక్టోబర్ 13 : దిల్లీలో విపక్షాల నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సమయంలో మహిళా జర్నలిస్ట్ రిచా పరాశర్ పట్ల లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన భద్రతా సిబ్బంది అమానవీయంగా వ్యవహరించడాన్ని సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వోటరు జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా ఈనెల 12న సుప్రీంకోర్టు సమీపంలో విపక్షాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఈ ఘటన జరిగింది. తాను మూడు నెలల గర్భిణిగా ఉన్నానని, ఆ సమయంలో రాహుల్ గాంధీ తన చేయి పట్టుకుని బలంగా లాగారని, వెంటనే ఆయన బాడీగార్డులు తనను తోసేయడంతో సుప్రీంకోర్టు మెట్లపై నుండి కిందపడిపోయానని రిచా పరాశర్ ఆరోపించారు. కాగా, కడుపులో నొప్పి, మెడ, మోకాలు, చేతికి గాయాలు కావడంతో ఆమెను దిల్లీలోని ఒక హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
రాజకీయ దుమారం
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల్లో స్రీ శక్తిని ఆరాధిస్తున్న తరుణంలో గర్బిణి అని కూడా చూడకుండా ఒక మహిళా జర్నలిస్టుపై ఇలా దాడి చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ఆయన బృందం దేశంలోని మహిళల”, జర్నలిస్టులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఖండన
కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. నిరసన ప్రదర్శనలో భారీ తోపులాట జరిగిందని, వైరల్ అవుతున్న వీడియోలో రాహుల్ గాంధీ ఆమెను నెట్టినట్లు ఎక్కడా లేదంటూ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




